సూపర్ స్టార్ మహేష్ బాబు,త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన అతడు సినిమా తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండే ఉంటుంది.ఇప్పటికి కూడా ఈ సినిమా టీవిలో ప్రసారం అయితే చూసే ప్రేక్షకులు చాల మంది ఉన్నారు.ఈ సినిమాలోని ప్రతి సీన్,ప్రతి డైలాగ్ కూడా ప్రేక్షకులకు బాగా గుర్తుంది పోతుంది.ఈ సినిమాకు మణిశర్మ అందించిన సంగీతం బాగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ సినిమాలో మహేష్ బాబు కు జోడిగా త్రిష నటించింది.ఈ సినిమాలో బ్రహ్మానందం కొడుకుగా చేసిన బుడ్డోడు అందరికి గుర్తుండే ఉంటాడు.ఈ సినిమాలో ఆ బుడ్డోడు వాళ్ళ నాన్న తో నాన్న నా కోసం ట్రైన్ తెచ్చావా అని అడుగుతాడు.అప్పుడు వాళ్ళ నాన్న హా తెచ్చాను రైల్వే స్టేషన్ లో ఉంది వెళ్లి తెచ్చుకో పో అనే డైలాగ్ అప్పట్లో పటాస్ ల పేలింది.ఇప్పటికి కూడా ఆ డైలాగ్ చాల మందికి గుర్తుండి పోయింది.
ఈ బుడ్డోడి పేరు దీపక్ సరోజ్.అతడు చిత్రం తర్వాత దీపక్ ఆర్య,లెజెండ్,పెద్దబాబు,ఆంధ్రు