సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఆశలతో అడుగుపెట్టి మంచి గుర్తింపును తెచ్చుకొని అతి చిన్న వయస్సులోనే ప్రాణాలు కోల్పోయిన నటి నటులు చాల మందే ఉన్నారు.చేసింది కొన్ని సినిమాలే అయినా కూడా తమ నటనతో ప్రేక్షకులను అలరించారు.అలా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అతి చిన్న వయస్సులో ప్రాణాలు కోల్పోయిన నటి నటులు వీళ్ళే…
కునాల్:ప్రేమికుల రోజు సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకున్న హీరో కునాల్ వ్యక్తిగత జీవితంలోని సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.30 ఏళ్ళ అతి చిన్న వయస్సులో ఈ హీరో ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది.
భార్గవి:అష్టా చెమ్మ సినిమాలో హీరో నాని కి చెల్లెలిగా నటించింది భార్గవి.అష్టా చెమ్మ సినిమా భార్గవికి మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది.తన ప్రేమను ఇంట్లో ఒప్పుకోలేదు అనే కారణంతో భార్గవి ఆత్మహత్యకు పాల్పడింది.
విజయ్ సాయి:అబ్బాయిలు అమ్మాయిలు అనే చిత్రంతో ఫేమస్ అయినా విజయ్ సాయి ఆ తర్వాత పలు సినిమాలలో నటించడం జరిగింది.ఆ తర్వాత వ్యక్తిగత సమస్యలతో విజయ్ సాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.
యశో సాగర్:ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రంతో హీరో గా ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోవడం జరిగింది.
సౌందర్య:తెలుగు ప్రేక్షకులకు సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అతి చిన్న వయస్సులోనే సౌందర్య విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది.
ప్రత్యూష:చాల సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రత్యూష వ్యక్తిగత సమస్యలతో అతి చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకున్నారు.
ఉదయ్ కిరణ్:ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న హీరో ఉదయ్ కిరణ్.ఆర్ధిక సమస్యలతో ఉదయ్ కిరణ్ 33 ఏళ్లకే ఆత్మహత్య చేసుకున్నాడు.
దివ్య భారతి:చిన్న వయస్సులోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ దివ్య భారతి.ఆ తర్వాత అతి చిన్న వయస్సులోనే ఆమె ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.
పునీత్ రాజ్ కుమార్:కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ చిన్న వయస్సులోనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు.
ఆర్తి అగర్వాల్:మొదటి సినిమాతోనే తన అందంతో అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ ఆర్తి అగర్వాల్.ఒక ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఆరోగ్య సమస్యలతో మరణించారు.