Srinivas Avasarala Avatar 2: ప్రపంచవ్యాప్తంగా జేమ్స్ కామెరూన్ అవతార్ 2 సినిమా డిసెంబర్ 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమా 160 భాషలలో రిలీజ్ చేస్తున్నారు.ఈ సినిమా రిలీజ్ అయినా మొదటి రోజే భారీ ఓపెనింగ్స్ దక్కించుకుంటుంది అందరు అంచనా వేస్తున్నారు.ఇక ఇండియాలో కూడా ఈ సినిమాను భారీ రేంజ్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు సినిమా యూనిట్.అలాగే తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి క్రేజ్ అయితే ఏర్పడుతుందని చెప్పచ్చు.ఈ సినిమా తెలుగులో వంద కోట్ల బిజినెస్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమాకు తెలుగు వెర్షన్ లో డైలాగ్స్ ప్రముఖ నటుడు రచయితా దర్శకుడు శ్రీనివాస్ అవసరాల అందించబోతున్నారట.
శ్రీనివాస్ అవసరాల ఊహలు గుసగుసలాడే సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.అయితే ఇంత పెద్ద సినిమాకు శ్రీనివాస్ ఎలా సెలెక్ట్ అయ్యాడు అంటే అది కేవలం డిస్ట్రిబ్యూటర్స్ ఆలోచన మాత్రమే కాదని..అవతార్ సినిమాను ఏ భాషలో రిలీజ్ చేయాలన్న కూడా జేమ్స్ కామెరూన్ టీం ప్రమేయం లేకుండా డబ్బింగ్ పనులు జరగవు అని చెప్తున్నారు.కేవలం డబ్బింగ్ కోసం మాత్రమే ప్రొడక్షన్ వాళ్ళు ఒక టీం ఏర్పాటు చేయడం జరుగుతుంది.ఇక అవతార్ కు డైలాగ్ వెర్షన్స్ రాసేవారు ఎవరైనా కూడా టీం తో ఇంటర్వ్యూ లో మాట్లాడాల్సి వస్తుంది.
అలాగే ప్రధాన పాత్రలకు డబ్బింగ్ చేయాలన్న వారు ఓకే చెయ్యకుండా ఫైనల్ చేయరు.డబ్బింగ్ కోసం డిస్ట్రిబ్యూటర్స్ ఒకరిని అనుకున్న తర్వాత సినిమా టీం కూడా వారిని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేస్తారు.అవసరాల శ్రీనివాస్ కు అమెరికా లో చదువుకున్న అనుభవం ఉంది కాబట్టి ఇంటర్వ్యూ లో కూడా టీం ను ఇంప్రెస్ చేసి ఛాన్స్ కొట్టేసాడు.శ్రీనివాస్ లో మంచి రచయితా మరియు దర్శకుడు ఉన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే డిస్ట్రిబ్యూటర్స్ అవసరాల శ్రీనివాస్ ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత సినిమా టీం అతనిని ఇంటర్వ్యూ చేసి ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.ఇక దీని కోసం అతనికి కోటి రూపాయలు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని సమాచారం.