Baby Movie : ఎవ్వరు ఊహించని విధంగా బేబీ 9 రోజుల కలెక్షన్స్…ఎంతంటే

Baby Movie

Baby Movie : ఆనంద్ దేవరకొండ,వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా బేబీ ఇటీవలే థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే.ఈ సినిమాలో మరొక హీరోగా విరాజ్ అశ్విన్ నటించడం జరిగింది.ట్రైయాంగిల్ మూవీ గా తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులకు ముఖ్యంగా యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది.ఇటీవలే రిలీజ్ రిలీజ్ అయినా సినిమా బేబీ చిన్న సినిమా గా వచ్చి ఊహించని సంచలన విజయం అందుకుంది.ఈ సినిమా కథ ఇప్పటి యువత కు కనెక్ట్ అయ్యే విధంగా ఉండడంతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రమ్మరథం పడుతున్నారు అని చెప్పచ్చు.

అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్న ఈ సినిమా ఊహించని స్థాయిలో రికార్డు స్థాయి కలెక్షన్లు రాబడుతుంది.ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ,విరాజ్ అశ్విన్ హీరోలుగా,వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించారు.ట్రైయాంగిల్ లవ్ స్టోరీ గా తెరకెక్కించబడిన ఈ సినిమా జులై 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఇప్పటికి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.సినిమా తారలు కూడా ఈ సినిమా పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ సినిమా ఇప్పటికి అంటే తొమ్మిది రోజులకు రూ.60 .3 కోట్లు గ్రస్స్ కలెక్షన్స్ ను రాబట్టింది.ఈ సినిమా రిలీజ్ కు ముందు కూడా మంచి బిసినెస్ జరిగింది.తక్కువ రోజుల్లోనే చిన్న సినిమాలలో ఈ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా బేబీ రికార్డును సొంతం చేసుకుంది.పది కోట్లతో తెరకెక్కించబడిన ఈ సినిమా మొదటి మూడు రోజుల్లోనే పెట్టిన మొత్తాన్ని రాబట్టుకోవడం జరిగింది.రెండవ వారంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా ఈ సినిమాకు కలెక్షన్లు తగ్గడం లేదు.ఇక త్వరలోనే బ్రేక్ ఈవెన్ ను సాధించడానికి రెడీ గా ఉంది బేబీ మూవీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *