Baby Movie OTT: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చుసిన అందరి నోటా వినిపిస్తున్న సినిమా పేరు బేబీ..ది మూవీ.థియేటర్ లకు యువత అందరు కూడా బారులు తీరేలా చేస్తున్న సినిమా బేబీ.ఇటీవలే ఏ సినిమా అయినా కూడా రెండవ రోజు బ్రేక్ ఈవెన్ సాధించిన దాఖలాలు చాల తక్కువే ఉన్నాయి.అయితే బేబీ సినిమా మాత్రం రూ.10 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కించబడి నాలుగు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.31 కోట్లు గ్రాస్ వసూళ్లను సాధించి డబల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.సాయి రాజేష్ దర్శకత్వం వచించిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ,వైష్ణవి చైతన్య,విరాజ్ అశ్విన్ మెయిన్ లీడ్స్ గా నటించడం జరిగింది.
జులై 14 న థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ బరిలో తన సత్తా చాటుతుందని చెప్పచ్చు.అయితే కొత్త సినిమాలు నాలుగు నుంచి ఎనిమిది వారలు థియేటర్లలో రన్ అయినా తర్వాత ఓటిటీ లో రిలీజ్ అయ్యే సంగతి అందరికి తెలిసిందే.మరికొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయినా రెండు మూడు వారాలలోనే ఓటిటీ లోకి వచ్చేస్తున్నాయి.ఈ క్రమంలోనే బేబీ ఓటిటీ రిలీజ్ గురించి కూడా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ సినిమా ఓటిటీ హక్కులను ప్రముఖ ఓటిటీ సంస్థ ఆహా సొంతం చేసుకుందని సమాచారం.బేబీ సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యి నెల రోజులు అయినా తర్వాత ఆగష్టు 15 న ఓటిటీ రిలీజ్ చేయడానికి చూస్తున్నారు.ఇక ఆ రోజు స్పెషల్ డే కావడం హాలిడే కావడంతో రీచ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఓటిటీ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.