ఒక్క ఏడాదిలో 6 హిట్లు కొట్టిన బాలయ్య సినిమాలు యేవో తెలుసా…ఇప్పటి వరకు ఎవరు బ్రేక్ చేయలేకపోయినా రికార్డ్ ఇదే…

సినిమా ఇండస్ట్రీలో హిట్లు ప్లాప్ లతో సంబంధం లేకుండా కొన్ని సినిమాలు కొంత మంది హీరోలకు చాల స్పెషల్ గా నిలిచిపోతాయి.అలాగే కొంత మంది హీరోలకు కొన్ని సంవత్సరాలు కూడా బాగా స్పెషల్ గా నిలిచిపోతాయి.టాలీవుడ్ లో స్టార్ హీరో అయినా నందమూరి బాలకృష్ణ కు తన కెరీర్ లో కొన్ని సంవత్సరాలు బాగా స్పెషల్ గా మిగిలిపోయాయి.తన కెరీర్ లో ఒకేసారి ఆరు హిట్ లు సాధించి ముఖ్యంగా 1986 సంవత్సరం ఆయనకు బాగా స్పెషల్ గా నిలిచిపోయింది.1986 సంవత్సరం బాలకృష్ణ కు తిరుగులేని స్టార్ గా నిలిపింది.మల్లి ఇటువంటి అరుదైన ఫీట్ బాలకృష్ణ కు ఏ సంవత్సరం లోను రిపీట్ కాలేదు.1986 వ సంవత్సరంలో బాలకృష్ణ ఏకంగా 6 హిట్ సినిమాలు సాధించారు.ఈ ఇయర్ లో బాలకృష్ణ డబుల్ హ్యాట్రిక్ హిట్ లు సొంతం చేసుకున్నారు.ఈ ఇయర్ లో బాలయ్య నటించిన 7 సినిమాలు విడుదల అయ్యాయి.

సంవత్సరం ప్రారంభంలో ఫిబ్రవరి 7 న విడుదల అయినా నిప్పులాంటి మనిషి చిత్రం మాత్రం ప్లాప్ అందుకుంది.ఇక ఆ తర్వాత ఫిబ్రవరి 28 న రిలీజ్ అయినా ముద్దుల కృష్ణయ్య మొదటి వారంలోనే కోటి రూపాయల షేర్లు వసూలు చేసి రికార్డును క్రియేట్ చేసింది.ఈ చిత్రం ఒక్క ఏరియాలోనే 100 రోజులు,175 రోజులు ఆడి మంచి కలెక్షన్లు నమోదు చేసింది.ఏప్రిల్ 15 న రిలీజ్ అయినా సీతారాముల కళ్యాణం చిత్రం బాలయ్య కు మరో హిట్ తెచ్చిపెట్టింది.ప్రతి రోజు అయిదు షోలతో రెండు ఏరియాలలో 100 రోజులు ఆడి రికార్డు క్రియేట్ చేసింది.జులై 2 న రిలీజ్ అయినా అనసూయమ్మ గారి అల్లుడు చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ లో బాలకృష్ణ కు మంచి పేరు తెచ్చి పెట్టింది.అప్పట్లో ఈ చిత్రం ట్విన్ సిటీస్ లలో 100 రోజులు ఆడి రికార్డు క్రియేట్ చేసింది.

ఈ చిత్రంతో బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం అందుకున్నారు.ఆ తర్వాత ఆగష్టు 7 న రిలీజ్ అయినా దేశోద్ధారకుడు చిత్రం రిలీజ్ అయ్యి మంచి ఓపెనింగ్స్ అందుకొని హిట్ అందుకుంది.ఆ తర్వాత సెప్టెంబర్ 19 రిలీజ్ అయినా కలియుగ కృష్ణుడు చిత్రం కమర్షియల్ హిట్ అయ్యింది.ఆ తర్వాత అక్టోబర్ 9 న రిలీజ్ అయినా అపూర్వ సహోదరులు చిత్రం అదిరిపోయే ఓపెనింగ్స్ తెచ్చుకొని హిట్ గా నిలిచింది.మొదటి సరి బాలకృష్ణ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ లో నటించారు.ఆ సమయంలో స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడి మరి ఈ చిత్రం ఘానా విజయం సాధించింది.ఏ హీరోకు నమోదు కానీ అరుదైన రికార్డు 6 హిట్ సినిమాలు సాధించడం 1986 సంవత్సరం బాలకృష్ణ కు చాల స్పెషల్ గా నిలిచిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *