తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.ఆయన గురించి యెంత చెప్పిన కూడా తక్కువే అనిపిస్తుంది.నటుడిగా,ప్రొడ్యూ
ఈ షో మొదటి సీజన్ గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో ఈ షో రెండవ సీజన్ ను ప్లాన్ చేసారు షో నిర్వాహకులు.దీనికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.ఈ ఈవెంట్ లో మాట్లాడిన బాలయ్య సినిమా విషయాలతో పాటు కుటుంబ విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు.ఈ షో లో మాట్లాడిన బాలయ్య తానూ సినిమాలతో బిజీ గా ఉన్నప్పుడు తన భార్య వసుంధరనే కుటుంబాన్ని లీడ్ చేసిందని..నేను కాదు నా భార్య వసుంధర అన్ స్టాపబుల్ అంటూ చెప్పుకొచ్చారు.ఇక ఈ షో సీజన్ 2 లో వాళ్ళ వాళ్ళ టైం చూసుకొని మెగాస్టార్ చిరంజీవి,నాగార్జున,వెంకటేష్ కూడా ఖచ్చితంగా నా షో కు వస్తారని తెలిపారు.
మొదటి సీజన్ కంటే రెండవ సీజన్ బ్లాక్ బస్టర్ అవుతుందని,చాల డిఫరెంట్ గా ప్లాన్ చేశామని…ఈసారి అంతా దబిడి దిబిడే అంటూ బాలయ్య తనదైన స్టైల్ లో చెప్పుకొచ్చారు.చివరలో యాంకర్ వచ్చి బాలకృష్ణ ను మావయ్య అని పిలవచ్చా అని అడిగినప్పుడు బాలయ్య స్పందిస్తూ నా మనవళ్లు నన్ను తాతయ్య అని పిలవరు..నువ్వు మావయ్య అని పిలుస్తావా…అన్నారు.అప్పుడు యాంకర్ బాలయ్య ను మీ మనవళ్లు మిమ్మల్ని యేమని పిలుస్తారు అని అడిగినప్పుడు బాలా అంటూ ముద్దుగా పిలుస్తారని చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ఈ షో సందర్భంగా బాలయ్య చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఇంటరెస్టింగ్ గా మారాయి.