Bala Krishna Jr NTR: ఢిల్లీ లో ఒకే వేదిక మీద బాలకృష్ణ,ఎన్టీఆర్…నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి

Bala Krishna Jr NTR

Bala Krishna Jr NTR: కేంద్ర ప్రభుత్వం తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు,దివంగత ముఖ్యమంత్రి అయినా నందమూరి తారకరామారావు శతజయంతి సందర్భంగా ఆయన పేరిట వంద రూపాయల నాణాన్ని ముద్రించింది.రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా సోమవారం ఆగస్టు 28 న ఈ వంద రూపాయల నాణాన్ని విదులచేస్తున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా సీనియర్ ఎన్టీఆర్ కుమారులు,కూతుర్లతో పాటు మిగిలిన కుటుంబ సభ్యులందరు ఇప్పటికే ఢిల్లీ కి చేరుకున్నారు.టిడిపి అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు.జూనియర్ ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు తెలుస్తుంది.

నందమూరి ఫ్యామిలీ ని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ కి ఆహ్వానించింది.కేంద్రం ఆహ్వానించిన వాళ్లలో చంద్రబాబు నాయుడు,పురందేశ్వరి,బాలకృష్ణ,ఎన్టీఆర్ పేర్లను ప్రస్తావించినట్లు సమాచారం.అయితే జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ కి వెళ్తున్నారా లేదా అనేది ఆయన అభిమానులలో నెలకొన్న ఆసక్తి.ఒకవేళ ఎన్టీఆర్ ఈ వేడుకలో పాల్గొన్నట్లయితే బాలకృష్ణ,ఎన్టీఆర్ ఒకే వేదిక మీద కనిపించడం ఖాయం.వీరిద్దరూ కలిసి కనిపించడం అరుదు.ఒకవేళ వీరిద్దరూ కలిసి ఒకే వేదిక మీద కలిసి కనిపించినట్లయితే నందమూరి అభిమానులు చాల ఖుషి అవుతారు.వీరిద్దరి మధ్య దూరం పెరిగినట్లు ఇటీవలే కొన్ని వార్తలు వినిపించిన సంగతి అందరికి తెలిసిందే.

ఇక గతంలో జరిగిన సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు ఎన్టీఆర్ హాజరు కాలేదు.తారకరత్న సంస్కరణ సభలో కూడా వీరిద్దరూ దూరంగా ఉన్నారు.దింతో వీరిద్దరి మధ్య దూరం పెరిగినట్లు సోషల్ మీడియాలో చాల వార్తలు వినిపించాయి.ఇక ఇటీవలే జరిగిన నందమూరి సుహాసిని కొడుకు పెళ్ళిలో నందమూరి ఫ్యామిలీ మొత్తం సందడి చేసారు.ఈ పెళ్లి వేడుకలో ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్,మోక్షజ్ఞ ఎంతో సరదాగా మాట్లాడుకుంటూ కనిపించరు.

మోక్షజ్ఞ ను ఎన్టీఆర్ ఆప్యాయంగా హత్తుకున్న ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినా సంగతి తెలిసిందే.మోక్షజ్ఞ చిరున్నవ్వులు చిందిస్తూ కనిపించిన ఫోటోను వెలకట్టలేని క్షణం అంటూ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో అది క్షణాల్లోనే వైరల్ గా మారింది.ఈ ఫోటో చూసిన నందమూరి అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు.ఇక మరోసారి నందమూరి బాలకృష్ణ,ఎన్టీఆర్ ఒకే వేదిక మీద కనిపించనుండడంతో నందమూరి అభిమానులలో ఆసక్తి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *