చిరంజీవి ఇంట్లో షూటింగ్ జరుపుకున్న బాలయ్య బ్లాక్ బస్టర్ సినిమా ఏదో తెలుసా…

తెలుగు సినిమా పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ కు ఉన్న ప్రత్యేకమైన ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే.బాలకృష్ణ కెరీర్ లో చాల సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి.ఆయన కెరీర్ లో కొన్ని సినిమాలకు స్పెషల్ స్తానం ఉందని చెప్పచ్చు.అలా బాలయ్య కెరీర్ లో ప్రత్యేకమైన సినిమాలలో నారి నారి నడుమ మురారి అనే చిత్రం కూడా ఒకటి.ఇద్దరు మరదళ్ల ముద్దుల బావగా ఈ చిత్రంలో బాలయ్య అద్భుతంగా నటించారు.కోదండరామి రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం యువరత్న ఆర్ట్స్ బ్యానర్ లో 1990 లో రిలీజ్ అయ్యింది.

ఈ చిత్రంలో శోభన,నిరోషా బాలయ్య కు జోడిగా నటించారు.ఇక ఈ చిత్రంలో ఊర్వశి శారదా,కైకాల సత్యనారాయణ,అల్లు రామలింగయ్య,రమా ప్రభ,కణికెల్లా భరణి పలువురు కీలక పాత్రలలో అలరించారు.ఈ చిత్రానికి కీరవాణి తండ్రి శివశక్తిదత్తలు,రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రచయితగా వ్యవహరించారు.

యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బాలకృష్ణ కు ఈ చిత్రంతో ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా చేయగలరు అన్న గుర్తింపు వచ్చిందని చెప్పచ్చు.ఈ చిత్రంలో బాలయ్య కు అత్తగా శారద నటించారు.వీరిద్దరి మధ్య సన్నివేశాలు హాస్యాస్పదంగా అందరిని ఆకట్టుకున్నాయి.కె వి మహదేవన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.ఈ చిత్రంలోని చాల సన్నివేశాలు అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లో చిత్రీకరించినవే అన్న విషయం చాల మందికి తెలియదు.

తమిళనాడు లోని వెలచేరి ప్రార్ధనలో చిరంజీవి గారికి హనీ హౌస్ అనే గెస్ట్ హౌస్ మరియు దాని పక్కనే రెండు ఎకరాల ఖాళీ స్థలం ఉన్నాయి.ఈ సినిమాలో బాలకృష్ణ ఒక పూరి గుడిసెలో ఉంటారు.ఆ పూరి గుడిసె కూడా చిరంజీవి గారి స్థలంలో ఏర్పాటు చేసిందే.అప్పట్లో ఈ చిత్రంలోని చాల సన్నివేశాలు చిరంజీవి గారి ఇంట్లో చిత్రీకరించారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *