కొరటాల శివ దర్శకత్వంలో బాలకృష్ణ,సాయిధరమ్ తేజ్ మల్టీ స్టారర్ సినిమా….!


ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో చాల మంది దర్శకులు మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.ఇప్పటికే జక్కన రాజమౌళి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాన్ ఇండియా లెవెల్ లో ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.మల్టీ స్టార్ సినిమా కావడంతో ట్రిపుల్ ఆర్ మీద ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.డివివి దానయ్య భారీ బడ్జెట్ తో ట్రిపుల్ ఆర్ సినిమాను నిర్మిస్తున్నారు.ఇప్పుడు మరో దర్శకుడు కొరటాల శివ నందమూరి బాలకృష్ణ గారితో మరియు మెగా మేనల్లుడు అయినా సాయి ధరమ్ తేజ్ తో మల్టీ స్టారర్ సినిమా తీసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ తో సినిమాలు చేయడానికి దర్శకులు క్యూ కడుతున్నారు.బాలయ్యవి గత మూడు సినిమాలు అనుకున్నంతగా విజయం సాధించక పోవడం తో ఇప్పుడు విడుదలకు సిద్ధమైన బాలకృష్ణ చిత్రం అఖండ సినిమా మీద ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.అఖండ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు.బాలకృష్ణ గోపీచంద్ మలినేని మరియు అనిల్ రావిపూడి తో కూడా సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

కొరటాల శివ కూడా నందమూరి బాలకృష్ణ తో ఒక మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ తో పాటు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నారని సమాచారం.ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందో వచ్చి చూడాల్సిందే.ఇది పక్కన పెడితే కొరటాల శివ మెగా స్టార్ చిరంజీవి తో ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.మరో పక్క జూనియర్ ఎన్టీఆర్ తో కూడా ఒక సినిమా చేయనున్నట్లు కొరటాల శివ ఇప్పటికే ప్రకటించటం జరిగిందే.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ మల్టీ స్టారర్ చిత్రం ట్రిపుల్ ఆర్ జనవరి 7 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *