టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ మొదటి సారిగా బుల్లితెర ఓటిటీ లో చేస్తున్న షో అన్ స్టాపబుల్.ప్రముఖ ఓటిటీ ఆహా లో లో ప్రసారం అయ్యే ఈ షో మొదటి సీజన్ ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఈ షో ద్వారా సినీ సెలెబ్రెటీల వ్యక్తిగత విషయాలను సైతం బయటకు రాబట్టారు బాలయ్య.ఈ షో హిట్ అయినప్పటి నుంచి ఆహా ఓటిటీ కు సుబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరిగిపోయారు అని చెప్పచ్చు.ఇక ఈ షో మొదటి సీజన్ గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో రెండో సీజన్ ను కూడా ప్రారంభించారు ఆహ.ఇప్పటి వరకు ఎవ్వరు చేయని ధైర్యం చేసి అల్లు అరవింద్ బాలయ్య ను హోస్ట్ గా ఈ షో ద్వారా పరిచయం చేసారు.

ఇటీవలే రెండవ సీజన్ ప్రారంభం అయినా ఈ షో లో మొదటి వారం తన బావ మరియు ఏపీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు తన అల్లుడు నారా లోకేష్ ను కూర్చోబెట్టి వ్యక్తిగత సీక్రెట్స్ ను కూడా రాబట్టారు బాలయ్య.ఇక బాలయ్య,చంద్రబాబు,లోకేష్ ల సరదా సంభాషణ కు రికార్డులు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ ఎపిసోడ్ కు వ్యూస్ కూడా లక్షల్లో వచ్చాయి.ఇక రెండవ ఎపిసోడ్ లో బాలయ్య బాబు త్రివిక్రమ్ కి ఫోన్ చేస్తారు.

అన్ స్టాపబుల్ షో కి ఎప్పుడు వస్తున్నావ్ అని బాలయ్య త్రివిక్రమ్ ను అడిగినప్పుడు…మీరు రమ్మంటే ఇప్పుడే వచ్చేస్తాను సార్ అంటారు త్రివిక్రమ్…దాంతో బాలయ్య త్రివిక్రమ్ తో తెలుసుగా ఎవరితో రావాలో అని అంటారు.ఇక రెండవ ఎపిసోడ్ లో త్రివిక్రమ్ తో కలిసి పవన్ కళ్యాణ్ వస్తున్నట్లు తెలుస్తుంది.జనాల్లో బాగా క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ ఈ షో కు వస్తున్నట్లు తాజా ప్రోమో ద్వారా తెలుస్తుంది.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేయి పట్టుకొని బాలయ్య ప్రేక్షకులకు అభివాదం చేస్తున్న ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.వైరల్ అవుతున్న ఈ ప్రోమో మెగా,నందమూరి అభిమానులకు నిద్ర లేకుండా చేస్తుందని చెప్పచ్చు.బాలయ్య బాబు తో కలిసి పవన్ కళ్యాణ్ టాక్ షో ఖచ్చితంగా రికార్డులు క్రియేట్ చేస్తుందని,అత్యధిక వ్యూస్ సాధిస్తుందని చెప్పచ్చు.