యాడ్స్ ను ఎంచుకోవడంలో ఎవరి పంతా వారిదే.. నటులు డబ్బు ఆర్జించాలంటే చాలా దారులు ఉంటాయి. అందులో యాడ్స్ (వ్యాపార ప్రకటనలు) రంగం ఒకటి. ఇందులో కొంత మంది హీరోలు ఎలాంటి ప్రకటన అయినా పర్వాలేదు.. డబ్బు వస్తే చాలనుకుంటారు. కానీ కొందరు మాత్రం ప్రజలపై ఎలాంటి ప్రభావం పడని వాటినే ఎన్నుకుంటూ తమ అభిమానుల మనుస్సులో స్థానం పదిలం చేసుకుంటూనే ఉంటారు.
స్టార్ హీరోలు చాలా వరకు డబ్బుల కోసం ఆలోచించరు. జనానికి చెడు చేసే యాడ్లకు దూరంగా ఉంటారు. ఆ లిస్ట్ లో నందమూరి బాలయ్యది ఫస్ట్ ప్లేసని చెప్పాలి. టాలీవుడ్ లో బాలయ్య బాబుకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇంత రాణిస్తున్న ఆయనకు వ్యాపార ప్రకటనల్లో నటించాలని కూడా ఎక్కువగానే ఆఫర్లు వచ్చాయి. కానీ వాటిని ఆయన రిజెక్ట్ చేస్తూ వచ్చారు. తన కెరీర్ లోనే మొదటి సారి ఓ వ్యాపార ప్రకటనలో నటించారు ఆయన విషయాలను తెలుసుకుందాం..

సాయిప్రియా కన్ర్టక్చన్స్(రియల్ ఎస్టేట్ యాజమాన్యం) తమ సంస్థకు యాడ్ చేసి పెట్టాలని ఇటీవల బాలయ్య బాబును కోరింది. వివరాలు తెలుసుకున్న బాలయ్య ఒకే చెప్పారు. షూటింగ్ కూడా పూర్తయింది. మొదటి సారి యాడ్ చేసిన బాలయ్య, సాయి ప్రియా కన్ర్టక్చన్స్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించినందుకు ఎంత తీసుకున్నారన్నది టాలీవుడ్ లో చర్చ రచ్చ చేస్తున్నది.

విశ్వసనీయంగా తెలిసిన సమాచారం మేరకు ఈ యాడ్, బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్నందుకు రూ. 16 కోట్లు తీసుకున్నారంట. బాలయ్య యాడ్ లో వచ్చిన డబ్బును తన సొంత అవసరాల కోసం వినియోగించుకోవడం లేదని తెలుస్తోంది. వీటిన్నింటిని తన తల్లి జ్ఞాపకార్థం తన తండ్రి నిర్మించిన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కు డొనేట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. బాలయ్య బాబు మనసు వెన్నకన్నా సున్నితమైందని చిత్ర వర్గాలు చెప్పుకుంటున్నాయి.