తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ఫాలోయింగ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలు సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్.అయితే పవన్ కళ్యాణ్ కు జోడిగా బాలు సినిమాలో నటించిన నేహా ఒబెరాయ్ హీరోయిన్ కూడా ప్రేక్షకులకు ఇప్పటికి బాగానే గుర్తుంది ఉంటుంది అని చెప్పచ్చు.

నేహా ఒబెరాయ్ బాలీవుడ్ ప్రముఖ నిర్మాత ధరమ్ ఒబెరాయ్ కూతురు.ధరమ్ ఒబెరాయ్ హిందీలో కాబిల్,షూట్ అవుట్ వంటి హిట్ చిత్రాలకు డైరెక్షన్ వహించారు.నిర్మాత సంజయ్ గుప్తా కూడా నేహా ఒబెరాయ్ కి దగ్గరి బంధువు అవుతారట.బాలు సినిమాలో నేహా చాల క్లాస్ పాత్రలో అమాయకపు అమ్మాయిలాగా నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.
బాలు సినిమా తర్వాత ఈమె తెలుగులో సినిమాలు చేయకపోయినా ఇప్పటికి కూడా తెలుగు సినిమా ప్రేక్షకులకు బాలు సినిమా హీరోయిన్ గా బాగా గుర్తుండిపోయింది.చాల గ్యాప్ తర్వాత నేహా జగపతి బాబు బ్రమ్మస్త్రం చిత్రంలో నటించడం జరిగింది.అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.ఆ తర్వాత నేహా హిందీ లో దస్ కహానియా,ఫుడ్ స్టాక్ విల్లా,ఆస్మాన్ వంటి సినిమాలలో నటించడం జరిగింది.

ఆ తర్వాత నేహా 2010 సంవత్సరంలో డైమండ్ వ్యాపారస్తుడు అయినా విశాల్ షా ను పెళ్లి చేసుకున్నారు.ప్రస్తుతం నేహా ఇంటర్నేషనల్ ఫిలిం అండ్ టెలివిషన్ క్లబ్ ఆఫ్ ఏషియన్ అకాడమీ లో ఒక మెంబెర్ గా వ్యవహరిస్తున్నారు.ఆమె వయస్సు పెరిగిన కొద్దీ ఇప్పటికి కూడా అలాగే నాజూగ్గా అందంగా ఉందని చూసిన వాళ్ళు చెప్తున్నారు.