చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా తమకు పట్టలేనంత ఆనందం కలిగినప్పుడు డాన్స్ చేస్తారు.ఇలా వయస్సుతో సంబంధం లేకుండా ఒక బామ్మా రోడ్డు మీద చేసిన అద్భుతమైన డాన్స్ వీడియొ ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.ఈ మధ్య కాలంలో ఇలాంటి భిన్నమైన వీడియోలు చాలానే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రతి రోజు దర్శనం ఇస్తున్నాయి.
వాటిలో కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి.ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ బామ్మా డాన్స్ వీడియొ కూడా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.చిందులు వేయాలంటే వయస్సుతో సంబంధం లేదు అంటూ రోడ్డు మీద ఈ బామ్మా చేసిన డాన్స్ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
సోషల్ మీడియాలో ఈ వీడియొ చుసిన నెటిజన్లు విపరీతంగా లైకులు చేస్తున్నారు.పెద్ద వయస్సులో కలిగే కీళ్ల నొప్పులు నడుము నొప్పి అన్ని మర్చిపోయి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న బామ్మా డాన్స్ కు నెటిజన్లు బాగా ఫిదా అవుతున్నారు.అలాగే తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.కొందరు ఇలాంటి నృత్యాన్ని ఎప్పుడు చూడలేదు అంటూ కామెంట్స్ చేస్తే మరికొందరు క్యా బాత్ హాయ్ దాది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram