Bandla Ganesh:దర్శకుడు కొరటాల శివ,ఎన్టీఆర్ కాంబినేషన్ లో త్వరలో ఒక సినిమా వస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.జాహ్నవి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా,అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు.ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా రిలీజ్ అయినా సంగతి తెలిసిందే.ఈ చిత్రానికి దేవర అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం.దేవర అనే టైటిల్ నాదే అంటూ బండ్ల గణేష్ తెలిపారు.కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 సినిమా మీద ప్రేక్షకులలో భారీగానే అంచనాలు నెలకొన్నాయి.
ఊర మాస్ లుక్ లో అభిమానులను అలరించేందుకు ఎన్టీఆర్ రెడీ అవుతున్నారు.రెండు నెలల క్రితం గ్రాండ్ గా పూజ కార్యక్రమాలు జరుపుకొని సెట్స్ మీద కు వెళ్లిన ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవలే ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భం గా రిలీజ్ చేసారు.పోస్టర్ తో పాటు టైటిల్ కూడా రెవీల్ చేసారు సినిమా యూనిట్.టైటిల్ రిలీజ్ చేసిన వెంటనే ఈ సినిమా మీద బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.బండ్ల గణేష్ కి పవన్ కళ్యాణ్ అంటే యెంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.పవన్ కళ్యాణ్ తో దేవర టైటిల్ పెట్టి సినిమా నిర్మించాలనేది బండ్ల గణేష్ డ్రీం.
పవన్ కళ్యాణ్ ను ఆరాధించే బండ్ల గణేష్ ఆయనను దేవర అని పిలుచుకుంటారట.దేవర టైటిల్ పవన్ కు బాగా సూట్ అవుతుందని ఆయన నమ్మకం.అయితే బండ్ల గణేష్ ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించుకున్నాడు కానీ రెన్యూవల్ చేయించుకోవడం మర్చిపోయాడు.గత కొన్ని రోజుల నుంచి దేవర బండ్ల గణేష్ రిజిస్టర్ చేయించుకున్న టైటిల్ అని ప్రచారం కూడా జరుగుతుంది.ఈ సినిమా కు దేవర టైటిల్ పెట్టడంతో అసహనం వ్యక్తం చేసారు బండ్ల గణేష్.ఈ టైటిల్ ను నేను రిజిస్టర్ చేయించుకున్నాను కానీ రెన్యూవల్ చేయించటం మర్చిపోవటంతో కొట్టేసారు అని చెప్పుకొచ్చారు.
దేవర నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న నా టైటిల్ నేను మర్చిపోవడం వల్ల నా టైటిల్ కొట్టేశారు 😡 https://t.co/Y4guc8Yl34
— BANDLA GANESH. (@ganeshbandla) May 19, 2023