Bangaram Movie Child Artist: పవన్ కళ్యాణ్ బంగారం సినిమా చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో…ఏం చేస్తుందో తెలుసా…

NEWS DESK
1 Min Read
Bangaram Movie Child Artist

Bangaram Movie Child Artist: సినిమా ఇండస్ట్రీలో చాల మంది చైల్డ్ ఆరిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఒకటి లేదా రెండు సినిమాలే చేసిన కూడా ఎప్పటికి మర్చిపోలేని గుర్తింపును సంపాదించుకుంటారు.అలా బంగారం సినిమాలో హీరోయిన్ చెల్లెలి పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన చిన్నారి కూడా తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును తెచ్చుకుంది.టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ హీరోగా,మీరా చోప్రా హీరోయిన్ గా నటించిన సినిమా బంగారం.ఈ చిత్రంలో హీరోయిన్ చెల్లెలిగా వింధ్య రెడ్డి పాత్రలో నటించిన చిన్నారి పేరు సనూష సంతోష్.

ఈమె బంగారం సినిమాతోనే మొదటి సరిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యింది.బంగారం సినిమా కంటే ముందు సనూష చైల్డ్ ఆర్టిస్ట్ గా మలయాళంలో దాదాపుగా 20 కు పైగా సినిమాలలో నటించింది.అతి చిన్న వయస్సులోనే సనూష రెండు సార్లు ఉత్తమ బాల నటిగా జాతీయ అవార్డులను అందుకోవడం జరిగింది.ఆ తర్వాత సనూష 2012 లో మిస్టర్ మురుగన్ అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత తెలుగులో రేణిగుంట,జీనియస్ వంటి చిత్రాలలో కూడా హీరోయిన్ గా నటించి అందరిని ఆకట్టుకుంది.

Bangaram Movie Child Artist Sanusha Santhosh
Bangaram Movie Child Artist Sanusha Santhosh

నాని హీరోగా తెరకెక్కిన జెర్సీ సినిమాలో కూడా జర్నలిస్ట్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.ప్రస్తుతం మాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ అక్కడే స్థిరపడింది సనూష.సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉండే సనూష తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను,మూవీ అప్ డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది.అప్పట్లో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆసక్తికరమైన విషయాలు చెప్తూ..కరోనా లాక్ డౌన్ సమయంలో ఒంటరితనంతో నిరాశ చెంది మానసిక వైద్యుడిని కూడా సంప్రదించినట్లు చెప్పుకొచ్చింది.

Bangaram Movie Child Artist Sanusha Santhosh
Bangaram Movie Child Artist Sanusha Santhosh
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *