బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపుతున్న బంగార్రాజు 2 డేస్ కలెక్షన్స్…

సోగ్గాడే చిన్ని నాయన చిత్రం 2016 లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.ఈ చిత్రంలో నాగార్జున కు జోడిగా రమ్య కృష్ణ,లావణ్య త్రిపాఠి నటించారు.మల్లి ఇన్ని సంవత్సరాలకు ఈ చిత్రంకు సీక్వెల్ గా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు చిత్రం సంక్రాంతి పండుగా సందర్భంగా జనవరి 14 న థియేటర్లలో రిలీజ్ అయ్యింది.ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున,అక్కినేని నాగచైతన్య హీరోలుగా నటించారు.

ఈ చిత్రంలో రమ్య కృష్ణ మరియు కృతి శెట్టి హీరోయిన్లుగా చేసారు.సినిమా కొంచెం రొటీన్ గా అనిపించినా బాగానే ఉంది అనే టాక్ తో దూసుకుపోతుంది.బంగార్రాజు చిత్రం కలెక్షన్ల పరంగా మొదటి రోజు బాగానే రాబట్టింది.రెండవ రోజు కూడా ఏమాత్రం తగ్గకుండా మొదటిరోజుకు సమానంగా రాబట్టింది.

బంగార్రాజు చిత్రం రెండు రోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి…నైజం:4 .45 cr ,సీడెడ్:3 .35 cr ,ఉత్తరాంధ్ర:1 .95 cr ,ఈస్ట్:1 .89 cr ,వెస్ట్:1 .40 cr ,గుంటూరు:1 .80 cr ,కృష్ణ:0 .96 cr ,నెల్లూరు:0 .85 ,ఏపీ మరియు తెలంగాణ:16 .65 cr ,రెస్ట్ అఫ్ ఇండియా మరియు ఓవర్సీస్:1 .50 cr ,వరల్డ్ వైడ్:18 .15 cr .ఈ చిత్రానికి 38 .31 cr థియరిటికల్ బిజినెస్ జరిగింది.బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 39 cr షేర్లను రాబట్టాలి.రెండు రోజులకు బంగార్రాజు చిత్రం 18 .15 cr షేర్లు రాబట్టింది.ఇంకా బ్రేక్ ఈవెన్ కు 20 .85 కోట్ల షేర్లు రాబట్టవలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *