భాగస్వామితో గొడవలు లేకుండా సంతోషంగా ఉండాలి అంటే బెడ్ రూమ్ లో ఈ మార్పులు చేసి చూడండి….

ఇంటి నిర్మాణంలో వాస్తు శాస్త్రానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇంట్లో ఆర్ధిక సమస్యలపై,ఆరోగ్యం పై,వ్యక్తుల మధ్య సంబంధాలపై వాస్తు ప్రభావం చాలానే ఉంటుంది అని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.అయితే చాల మంది తమ జీవిత భాగస్వామి తో తరచూ గొడవలు పడుతూ ఉంటారు.దంపతుల బెడ్ రూమ్ వాస్తు ప్రకారం లేకపోవడం వలన కూడా జీవిత భాగస్వాముల  మధ్య గొడవలకు కారణం అవుతుంది అని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.అయితే వాస్తు ప్రకారం దంపతుల బెడ్ రూమ్ లో కొన్ని మార్పులు చేయడం వలన జీవిత భాగస్వాముల మధ్యలో గొడవలు రాకుండా ఉంటాయి అని నిపుణులు చెప్తున్నారు.

అవి ఏంటంటే…వాస్తు శాస్త్రం ప్రకారం దంపతుల పడకగదిలో అద్దము ఉండకూడదు అని చెప్తున్నారు నిపుణులు.నిద్రపోయే సమయంలో శరీరంలో ఏ భాగము కూడా అద్దంలో కనిపించకూడదట.ముఖ్యంగా దంపతుల పడకగదిలో అద్దం ఉంటె వారి బంధంలో చీలిక వస్తుంది అని నిపుణులు చెప్తున్నారు.అద్దం దంపతుల పడకగదిలో లేకుండా చూసుకోవాలి ఒకవేళ ఉన్నట్లయితే రాత్రి నిద్రపోయే సమయంలో అద్దం ను ఒక బట్టతో పూర్తిగా కవర్ చేయాలి.ఇంట్లోకి బయట నుంచి వచ్చే వ్యక్తుల చూపు నేరుగా పడకగదిలో ఉన్న అద్దం మీద పడకూడదు.వైవాహిక జీవితంలో చిరాకులు వస్తాయి అని నిపుణులు చెప్తున్నారు.

మంచాన్ని బయట నుంచి వచ్చే వ్యక్తుల చూపు నేరుగా పడకుండా అమర్చుకోవాలి.బెడ్ రూమ్ ను కర్టెన్ లతో కవర్ చేసి ఉంచడం మేలు.దంపతుల బెడ్ రూమ్ కు ఒకటి కంటే ఎక్కువ ద్వారం ఉండకూడదు.ఉన్నట్లయితే ఎల్లప్పుడూ మూసి ఉంచాలి.అలాగే బెడ్ రూమ్ లో ఉండే బాత్రూమ్ తలుపును కూడా ఎప్పుడు మూస్ ఉంచాలి.ఇలా చేయకుంటే బెడ్ రూమ్ లో నెగటివ్ ఎనర్జీ ఏర్పడి అనవసరమైన తగాదాలు ఏర్పడతాయి.అలాగే మంచం కింద ఎప్పుడు కూడా ఎలాంటి వస్తువులు లేకుండా చూసుకోవాలి.ఇంటి ప్రధాన ద్వారం ఇంట్లో శక్తి ప్రవాహానికి చాల ముఖ్యమైనదిగా చెప్పబడుతుంది.అలాగే ఇంట్లో ప్రతి ఒక్కరు ఇంటి ప్రధాన ద్వారం నుంచే ఇంట్లోకి వెళ్ళాలి,ఇంటి ప్రధాన ద్వారం దగ్గర మురికి లేకుండా చూసుకోవాలి.ప్రధాన ద్వారం దగ్గర చెత్త వేసే కుండీలు కూడా లేకుండా చూసుకోవాలి.వీటివలన ఇంట్లో సభ్యుల మధ్య గొడవలు ఏర్పడి సంబంధాలు చెడిపోయే ప్రమాదం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *