భారీ రెమ్యూనరేషన్ లిస్ట్ లో అల్లు అర్జున్…ఆ ప్రొడక్షన్ లో చేయడానికి ఏకంగా అన్ని కోట్లు ఆఫర్…

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్,సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భారీ అంచనాల వద్ద డిసెంబర్ 17 న రిలీజ్ అయ్యింది.మొదట్లో కొంచెం మిశ్రమ స్పందన వచ్చిన కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర తగ్గేదేలే అంటూ కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది.తెలుగులో తప్పించి మిగిలిన అన్ని భాషలలో పుష్ప అంచనాలకు మించి కలెక్షన్లను రాబట్టింది.తెలుగు సినిమా ఇండస్ట్రీ కి అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చారు.ఆ తర్వాత పలు సినిమాలు చేసి తన అద్భుతమైన నటనతో మరియు డాన్స్ తో ప్రేక్షకులు మైమరపించారు.తెలుగు రాష్ట్రాలలో అల్లు అర్జున్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఫాలోయింగ్ పాన్ ఇండియా లెవెల్ లో పెరిగిపోయింది.

పుష్ప ది రైజ్ అల్లు అర్జున్ కు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది.ముఖ్యంగా తెలుగు,తమిళ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.పుష్ప ది రైజ్ చిత్రం అల్లు అర్జున్ కు పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపుతో పాటు గత సంవత్సరం రిలీజ్ అయినా సినిమాలు అన్నింటిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా గుర్తింపు తెచ్చి పెట్టింది.దాదాపుగా మూడు వందల కోట్ల గ్రాస్ ను పుష్ప కొల్లగొట్టింది.హిందీలో ఏకంగా 75 కోట్ల కలెక్షన్స్ రాబట్టి అక్కడి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.పుష్ప సెకండ్ పార్ట్ మీద ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి.పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ ఫిబ్రవరి లేదా మార్చ్ లో మొదలుకానుంది సమాచారం.

ఈ సినిమా తర్వాత బన్నీ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.అలాగే దక్షిణాది నిర్మాణ సంస్థ అల్లు అర్జున్ తో పాన్ ఇండియా సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తుందని గట్టిగా వార్తలు వస్తున్నాయి.లైకా ప్రొడక్షన్స్ లో అల్లు అర్జున్ సినిమా చేయడానికి భారీగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం.ఏకంగా 75 కోట్లు పారితోషకం ఇస్తున్నట్లు సమాచారం.అయితే ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోలలో ప్రభాస్ మొదటి స్థానంలో ఉన్నారు.పాన్ ఇండియా సినిమాలకు ప్రభాస్ 100 కోట్లు పారితోషకం తీసుకుంటున్నారు.భారీగా రెమ్యూనరేషన్ తీసుకోవడంలో ప్రభాస్ తర్వాతి స్తానం బన్నీ ది కానుందని సమాచారం.అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రావలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *