Bhavz Menon: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి దాదాపుగా ఇప్పటి వరకు చాల మంది సెలెబ్రెటీల సినిమా ఇండస్ట్రీ స్టార్ల చిన్ననాటి ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.ఈ క్రమంలో దాదాపుగా సౌత్ స్టార్ హీరోయిన్ ల చిన్ననాటి ఫోటోలు మీరు చూసే ఉంటారు.పైన ఫొటోలో ముద్దు ముద్దు గా యువరాణి లా ఉన్న హీరోయిన్ ఎవరో కాదు మహాత్మా సినిమాలో హీరో శ్రీకాంత్ కు జోడిగా నటించిన భావన మీనన్.ఈమె తెలుగు లో చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది ఈ అమ్మడు.ఏ పాత్రలో అయినా ఒదిగి పోయి తన నటనతో అందరిని ఆకట్టుకుంది భావన.మహాత్మా సినిమాలో నీలాపురి గాజుల ఓ నీలవేణి అనే సాంగ్ యెంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ సాంగ్ తో ఈమె మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.ఆ తర్వాత ఈమె తెలుగులో ఒంటరి,హీరో,నిప్పు వంటి సినిమాలలో నటించడం జరిగింది.ప్రస్తుతం ఈమె కన్నడ,తమిళ్,మలయాళం సినిమాలలో నటిస్తూ బిజీ గా ఉందని సమాచారం.ప్రస్తుతం చిన్ననాటి ఫొటోలో క్యూట్ గా యువరాణి ల ఉన్న భావన మీనన్ ఫోటో నెట్టింట్లో అందరికి ఆకట్టుకుంది.అయితే ఈ ఫొటోలో భావన ను కనిపెట్టడానికి కొంత సమయం పడుతుంది అని చెప్పచ్చు.