భీమ్లా నాయక్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్లు ఎవరో తెలుసా…

NEWS DESK
1 Min Read

పవన్ కళ్యాణ్,రానా దగ్గుపాటి హీరోలుగా సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్ ఇటీవలే ఫిబ్రవరి 25 న రిలీజ్ అయినా సంగతి అందరికి తెలిసిందే.హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ చిత్రంలో నిత్యా మీనన్,సంయుక్త మీనన్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు.సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు,స్క్రీన్ ప్లే అందించడం జరిగింది.ఈ చిత్రంలో రానా ఒక ఎక్స్ మిలిటరీ మెన్ డానియల్ శేఖర్ గా మరియు పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ భీమ్లా నాయక్ గా ఈ చిత్రంలో అద్భుతంగా నటించడం జరిగింది.

ఈ చిత్రం మలయాళ చిత్రం అయినా అయ్యప్పనుం కోషియం అనే చిత్రం కు రీమేక్ గా తెరకెక్కడం జరిగింది.ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కించాలి అని అనుకున్నప్పుడు ముందుగా కొంత మంది స్టార్లను సంప్రదించారు.ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కు ముందు వెంకటేష్,బాలకృష్ణ,రవితేజ లను సంప్రదించారు మూవీ మేకర్స్.హీరో రవితేజ ఫైనల్ అయినట్టే అయ్యి తప్పుకోవడం జరిగింది.ఆ తర్వాత త్రివిక్రమ్ ఇన్ఫ్లుయెన్స్ తో పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడం జరిగింది.

త్రివిక్రమ్ కూడా ఈ చిత్రంలో భాగం కావడం జరిగింది.ఈ చిత్రంలో పవన్ కు జోడిగా ముందు సాయి పల్లవి ని హీరోయిన్ గా అనుకున్నారు.ఆ పాత్రకి సాయి పల్లవి నో చెప్పడంతో నిత్యా మీనన్ ను తీసుకున్నారు.రానా కు జోడిగా కూడా ముందు ఐశ్వర్య రాజేష్ ను అనుకున్నారు.కానీ కొన్ని కారణాల వలన ఆమె నో చెప్పడంతో సంయుక్త మీనన్ ను తీసుకున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *