Bichagadu 2 OTT: బిచ్చగాడు 2 ఓటిటీ పార్టనర్ ఫిక్స్…స్ట్రీమింగ్ ఎప్పటి నుంచో తెలుసా…

Bichagadu 2 OTT

Bichagadu 2 OTT: తెలుగు సినిమా ప్రేక్షకులు తెలుగు సినిమాలతో పాటు ఇతర భాష సినిమాలను కూడా ఆదరిస్తుంటారు.అందుకే తెలుగు సినిమా ప్రేక్షకులను అసలైన సినిమా లవర్స్ గా చెబుతుంటారు.సినిమా బాగుంటే అది ఏ భాష సినిమా అయినా పట్టించుకోరు తెలుగు సినీ ప్రేక్షకులు.ఈ క్రమంలోనే కన్నడ,తమిళ్,మలయాళం,హిందీ లోని సినిమాలు తెలుగు భాషలో భారీ ఎత్తున డబ్ అవుతుంటాయి.టాలీవుడ్ డబ్బింగ్ మార్కెట్ కు ఊపు వచ్చింది మాత్రం తమిళ సినిమాలతోనే అని చెప్పచ్చు.

Advertisement

కోలీవుడ్ లో రూపొందే చాల సినిమాలు ఏకకాలంలో తెలుగు లో కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి.అలా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయినా సినిమాలలో బిచ్చగాడు కూడా ఒకటి.తల్లి సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా బిగ్గెస్ట్ హిట్ అందుకుంది.

విజయ్ ఆంటోనీ బిచ్చగాడు పాత్రలో అద్భుతంగా నటించారు.ఇక ఈ సినిమాకు సీక్వెల్ ప్రకటించి నప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు.ఈ శుక్రవారం రిలీజ్ అయినా బిచ్చగాడు 2 సినిమాకు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది.ఈ సినిమా ఓటిటీ రైట్స్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అందుకున్నట్లు సమాచారం.జూన్ మూడో వారంలో ఈ సినిమా ఓటిటీ లో విడుదల అవుతుందని సమాచారం.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *