Divi Vadthya: బుల్లితెర మీద ప్రసారం అయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా బాగా ఫేమస్ అయినా వాళ్లలో దివి కూడా ఒకరు అని చెప్పచ్చు.బిగ్ బాస్ కు రాకముందు దివి పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించింది.మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి సినిమాలో కూడా దివి నటించడం జరిగింది.అయితే బిగ్ బాస్ షో తర్వాత ఈమెకు మంచి గుర్తింపు లభించింది.బిగ్ బాస్ షో లో తనదైన ఆటతో దివి ప్రేక్షకులను ఆకట్టుకుంది.అలాగే గ్లామర్ షో తో కుర్రకారును తనవైపు తిప్పుకుంది దివి.
బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్న దివి ఆట తీరు మెగాస్టార్ చిరంజీవి ను కూడా ఆకట్టుకుంది.బిగ్ బాస్ తర్వాత కూడా దివి పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించింది.మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో దివి ఒక చిన్న పాత్రలో కనిపించడం జరిగింది.ఒకటి రెండు ప్రైవేట్ ఆల్బమ్స్ లో కూడా నటించి అందరిని మెప్పించింది ఈ అమ్మడు.ఈ ఆల్బమ్స్ కు సోషల్ మీడియాలో మంచి వ్యూస్ వచ్చాయి.
ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉండే దివి తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారును ఆకర్షిస్తూ ఉంటుంది.తాజాగా దివి పల్లెటూరి పడుచులా ఫోటోలకు ఫోజులిచ్చి సోషల్ మీడియాలో షేర్ చేసింది.వైరల్ అవుతున్న ఈ ఫోటోలకు ఫిదా అయినా నెటిజన్లు హీరోయిన్ లకు ఏ మాత్రం తీసి పోదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం దివి పల్లెటూరి గెటప్ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతూ కుర్రాళ్ళ మనసులో సెగలు పుట్టిస్తున్నాయి.
View this post on Instagram