Mahesh Vitta: యూట్యూబర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి ఆ తర్వాత పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన మహేష్ విట్టా గురించి అందరికి తెలిసిందే.ఫన్ బకెట్ అనే కామెడీ సిరీస్ ద్వారా మహేష్ మంచి గుర్తింపు వచ్చింది.చిత్తూరు స్లాంగ్ లో మహేష్ మాట్లాడే మాటలు అందరిని అలరిస్తాయి.అలా మంచి గుర్తింపు తెచ్చుకున్న మహేష్ కు నాని హీరో గా నటించిన కృష్ణార్జున యుద్ధం అనే సినిమాలో నటించే అవకాశం దక్కింది.
ఆ తర్వాత మహేష్ శమంతకమణి,టాక్సీ వాలా,నిను వీడని నీడను నేను,ఏ 1 ఎక్స్ప్రెస్,చలో,యురేకా,కొండపో
తాజాగా మహేష్ సైలెంట్ గా పెళ్లి చేసుకొని ఒక ఇంటి వాడు అయ్యాడు.సెప్టెంబర్ 2 న మహేష్ శ్రావణి అనే అమ్మాయిని ఘనం గా పెళ్లి చేసుకున్నాడు.కడప జిల్లా హెల్త్ క్లబ్ ఫంక్షన్ హాల్ లో బంధు మిత్రుల సమక్షంలో మహేష్,శ్రావణి ల వివాహం ఘనం గా జరిగింది.అయితే శ్రావణి మహేష్ చెల్లెలి స్నేహితురాలు అవ్వడంతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నట్లు సమాచారం.ప్రస్తుతం మహేష్,శ్రావణి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram