Rathika Rose: బుల్లితెర మీద ప్రసారం అయ్యే బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొన్న కంటెస్టెంట్స్ గురించి అందరికి తెలిసిందే.ఈ సీజన్ లో 10 వ కంటెస్టెంట్ గా వచ్చింది రతికా రోజ్.బిగ్ బాస్ హౌస్ లో నాలుగు వారలు కొనసాగిన తర్వాత ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది.రతికా రోజ్ 2016 లో బుల్లితెర మీద ప్రసారం అయ్యే పటాస్ షో తో ఎంట్రీ ఇచ్చింది.అయితే ఈ షో నుంచి ఆమెకు అనుకున్నంత గుర్తింపు అయితే లభించలేదు.
ఆ తర్వాత రతికా రోజ్ 2021 లో బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది అనే సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది.ఇక ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్లిందో కూడా ఎవ్వరికీ తెలియదు కాబట్టి ఈ సినిమా నుంచి కూడా ఆమెకు గుర్తింపు రాలేదు అనే చెప్పాలి.ఆ తర్వాత రతికా రోజ్ తెలుగులో వెంకటేష్ నటించిన నారప్ప,విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం,నేను స్టూడెంట్ సార్ అనే సినిమాలలో నటించడం జరిగింది.
అయితే బిగ్ బాస్ సీజన్ 7 లో అడుగు పెట్టిన రతికా రోజ్ తన అందంతో అందరిని ఆకట్టుకుంది.అయితే కేవలం నాలుగు వారలు మాత్రమే హౌస్ లో ఉన్న కూడా రతికా మంచి గుర్తింపును సంపాదించుకుంది.నాలుగు వారాలకు గాను ఆమె బిగ్ బాస్ లో మంచి రెమ్యూనరేషన్ అందుకుంది తెలుస్తుంది.ఇక తాజాగా రతికా రోజ్ తన గ్లామర్ ఫోటో లను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్ గా మారాయి.
View this post on Instagram