Bigg Boss 7 Telugu: ప్రస్తుతం బుల్లితెర మీద ప్రసారం అవుతున్న ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 .ప్రతి వారం వీకెండ్ లో హోస్ట్ నాగార్జున గారు హౌస్ మేట్స్ చేసిన మిస్టేక్స్ ను చెప్తూ ఒక్కరిని క్లాస్ తీసుకుంటారు.అలాగే నామినేషన్స్ లో ఉన్నవారిని ఒక్కక్కరిని సేవ్ చేస్తూనే హౌస్ లో ఉన్న వారితో గేమ్స్ ఆడిస్తూ ఎంటర్టైన్మెంట్ చేస్తారు.కొత్త కంటెస్టెంట్స్ కూడా హౌస్ లో రావడం తో హౌస్ లో సందడి మరింత పెరిగింది.ఇక ఈ వారం నామినేషన్స్ లో 7 ఉన్న సంగతి అందరికి తెలిసిందే.
ఈ వారం నామినేషన్స్ లో శోభా శెట్టి,నాయని పావని,ప్రిన్స్ టవర్,టేస్టీ తేజ,అమరదీప్,పూజ మూర్తి,అశ్విని.వీకెండ్ వచ్చిందంటే చాలు బిగ్ బాస్ హౌస్ లో సందడి మొదలవుతుంది.హోస్ట్ నాగార్జున శనివారం రోజు ఎంట్రీ ఇచ్చి హౌస్ మేట్స్ చేసిన మిస్టేక్స్ కు వారిని క్లాస్ తీసుకుంటారు.నామినేషన్ లో ఉన్న వారిని ఒక్కక్కరిని సేవ్ చేస్తూ అందరికి టెన్షన్ పెట్టిస్తూ ఆటలు,పాటలు,గేమ్స్ లతో హౌస్ లో ఫుల్ సందడి ఉంటుంది.
ఈ వారం నామినేట్ అయినా ఏడుగురిలో ఒక్కరు ఎలిమినేటి అవుతారు.ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ఈ వారం శోభా శెట్టి తక్కువ ఓట్ల తో ఎలిమినేటి అయ్యే అవకాశం ఉంది.బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టినప్పటి నుంచి శోభా శెట్టి తనదైన ఆట తీరుతో అందరిని ఆకట్టుకుంది.ఆ తర్వాత ఆమె పవర్ అస్త్ర ను దక్కించుకుని నామినేషన్స్ నుంచి తప్పించుకున్న సంగతి తెలిసిందే.నామినేషన్స్ రోజు శోభా శెట్టి కొత్త వచ్చిన కంటెస్టెంట్ అశ్విని పై ఫైర్ అయ్యింది.అయితే ఈ వారం నామినేషన్స్ లో శోభా శెట్టి కి తక్కువ ఓట్లు రావడంతో ఆమె ఎలిమినేటి అయ్యే ఛాన్స్ ఉందని వినిపిస్తుంది.
View this post on Instagram