Home న్యూస్ Viral video:ఫ్లై ఓవర్ ను ఢీ కొట్టిన బైకర్…తృటిలో తప్పిన ప్రమాదం…వీడియొ వైరల్

Viral video:ఫ్లై ఓవర్ ను ఢీ కొట్టిన బైకర్…తృటిలో తప్పిన ప్రమాదం…వీడియొ వైరల్

0
biker hit wall

Viral video: ఈ భూమిపై బ్రతకటానికి ఇంకా నూకలు మిగిలి ఉంటె ఎంతటి ప్రమాదం నుంచి అయినా క్షణాల్లో తప్పించుకున్న సంఘటనలు చాలానే ఉన్నాయి.సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సిసి కెమెరాలలో రికార్డు అయినా ఇలాంటి ప్రమాదాలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.ప్రభుత్వాలు,అధికారులు వాహనాలను నడిపే సమయంలో ఎంతో జాగ్రత్తలు పాటించాలి అని చెప్తూనే ఉన్నారు.అయినా కూడా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.అనారోగ్యం కారణంగా చనిపోయిన వారి కంటే ప్రపంచవ్యాప్తంగా ప్రమాదాల బారిన పడి చనిపోయిన వారు చాల మంది ఉన్నారు అంటూ గణాంకాలు కూడా చెప్తున్నాయి.

గమ్యం త్వరగా చేరుకోవాలి అనే ఆతురుతా,ఆలస్యంగా బయలు దేరడం ఇలా కారణం ఏదైనా ప్రమాదం బారిన పడుతున్నారు.బ్రతకాలని రాసి ఉంటె ఎంతటి ప్రమాదం నుంచి అయినా క్షణాల్లో బయట పడచ్చు అని తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియొ ను చుస్తే అర్ధమవుతుంది.గుజరాత్ లోని సూరత్ లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.ఫ్లై ఓవర్ మీద బైక్ మీద వేగంగా వెళ్లే ఒక యువకుడు కారును ను ఓవర్ టేక్ చేసి రోడ్డు కు అవతలి వైపు వెళ్ళటానికి ప్రయత్నం చేసాడు.

అప్పటికే బైక్ వేగం అధికంగా ఉండడంతో బైక్ ను కంట్రోల్ చేయలేక ఫ్లై ఓవర్ ను డి కొట్టి ఫ్లై ఓవర్ గోడపై ఒక్కసారిగా పడ్డాడు.ఆ యువకుడి అదృష్టం బాగుండడంతో ఫ్లై ఓవర్ లోపలి వైపు పడ్డాడు.లేకపోతె ఫ్లై ఓవర్ అవతలి వైపు పడి ఉండేవాడు.ఇదంతా వెనక వస్తున్నా కారులో ఒక వ్యక్తి రికార్డు చేసి షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఈ వీడియొ ను చుసిన నెటిజన్లు వేగం కంటే ప్రాణం మిన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here