Home సినిమా ఓటీటీ బాక్సాఫీస్ ను తిరగరాస్తున్న బింబిసార..!

ఓటీటీ బాక్సాఫీస్ ను తిరగరాస్తున్న బింబిసార..!

0
Bimbisara Movie
Bimbisara Movie

Bimbisara: నందమూరి వారసుడు కళ్యాణ్ రామ్ కేథరిన్ థెరస్సా, సంయుక్త మీనన్ నటించిన ‘బింబిసార’ మూవీ ప్రస్తుతం ఓటీటీలో స్ర్టీమ్ అవుతోంది. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన చాలా కాలం తర్వాత ఓటీటీకి వచ్చింది ఈ మూవీ. జీ 5 లో 21 అక్టోబర్, 2022 నుంచి స్ర్టీమింగ్ లో ఉన్న ఈ సినిమా హల్ చల్ చేస్తూ రికార్డులను తిరగరాస్తోంది. 

చాలా కాలం తర్వాత కళ్యాన్ రామ్ నూతన దర్శకుడు వశిస్ట్ తో మంచి హిట్ అందుకున్నారనే చెప్పాలి. కళ్యాన్ రామ్ హీరోగానే కాదు.. మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా కూడా చిత్రంతో గుర్తింపు దక్కించుకున్నాడనే చెప్పాలి. ఈ సినిమాను ఆయనే స్వయంగా నిర్మించారు. భవిష్యత్ లోకి ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది అనే కంటెంట్ తీసుకొని ఒకప్పటి కర్కోటక రాజు (బింబిసారుడు) భవిషత్ పరిణామాల దృష్ణా మహోన్నత వ్యక్తిగా మారి ఒక చిన్నారిని కాపాడే బ్యాక్ గ్రౌండ్ కథతో సాగే ఈ చిత్రం చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరినీ అలరించింది. 

 Bimbisara
Bimbisara

ఇక కళ్యాణ్ రామ్ విషయానికి వస్తే హిట్ ప్లాపులను పెద్దగా పట్టించుకోరు. కథ నచ్చిందా.. ఆడియన్స్ ను అలరిస్తుందా అన్న అంచనాతో ముందుకెళ్తాడు. ఇందులో భాగంగా ఆయన నటించిన బింబిసార ఆగస్టు 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజై థియేటర్స్ లలో దిగ్విజయంగా ప్రదర్శింపబడింది. మంచి టాక్ రావడంతో వసూళ్లను సైతం అదే రేంజ్ లో రాబట్టింది. అమెరికాలో వన్ మిలియన్ డాలర్స్ కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టింది. మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.7 కోట్లకుపైగా (రూ.11 కోట్లకు పైగా గ్రాస్) వసూలు చేసింది. థియెటికల్ రన్ ముగిసిన వెంటనే ఈ చిత్రం తాజాగా ఓటీటీ ప్లాట్ ఫారంపైకి ఎక్కింది. జీ 5లో మంచి స్ర్టీమింగ్ లో ఉంది. ఇక్కడ కూడా మంచి రికార్డులనే దక్కించుకుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మళయాలంలో 100 మిలియన్ స్ర్టీమింగ్ యూనిట్ ను పూర్తి చేసుకుందని జీ5 తాజాగా ప్రకటించింది. ఓటీటీలో కూడా రూ. 2.90 కోట్ల లాభాలు తెచ్చిపెట్టింది. 

 Bimbisara
Bimbisara

ఈ మూవీలో మన హీరో కళ్యాణ్ రామ్ డ్యూయల్ రోల్ పోషించాడు. ఒకటి బింబిసారుడిగా, మరోటి దేవదత్తుడిగా. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై పీరియాడిక్ కు సైన్స్ జోడించి తీసిన చిత్రమిది. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణి, చిరంతన్ భట్ వ్యవహరించారు. వీరి సంగీతం కూడా హైలట్ గా నిలిచింది. చోటా కే నాయుడు సినిమాటో గ్రఫీ చేయగా, తమ్మి రాజు ఎడిటింగ్ చేశారు. తన కేరీర్ లో ఇలాంటి కథను ఎంచుకొని ముందుకెళ్లిన కళ్యాణ్ రామ్ గొప్ప సాహసం చేశాడనే చెప్పాలి. 

 Bimbisara
Bimbisara

మొత్తంగా చెప్తే ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ పోషించిన రోల్ అద్భుతంగా ఉందంటూ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. కరుణ లేని కర్కోటక రాజుగా బింబిసారుడిగా ఒక రోల్ లో పోషిస్తే, మరో రోల్ లో మంచి మానవత్వం ఉన్న ప్రజల కోసం నిత్యం పాటుపడతాడు. కరువుకు గురైన రాజ్యాన్ని రక్షించుకోవడంలో దేవదత్తుడు ఆరాట పడుతుంటే తాను చంపిన చిన్నారిని భవిష్యత్ లో బతికించుకునేందుకు బింబిసారుడు ధన్వంతరీ పుస్తకం కోసం నిధిని తెరవాలని అనుకుంటారు. మిగతా స్టోరీ ఓటీటీలో చూసేయండి. ఈ సినిమాలో మెరినా హుస్సేస్, శ్రనివాస్ రెడ్డి, వెన్నెల కిశోర్, ప్రకాశ్ రాజ్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here