రావణుడు ఎలా ఉంటాడో ఎన్టీఆర్ ను చూసి నేర్చుకో అంటూ దర్శకుడిపై ఫైర్ అయినా కెజిఎఫ్ నటి…

దేశ ప్రజలకు రావణుడు ఎలా ఉంటాడు అనే విషయం మీద ఒక క్లారిటీ ఉంది.ముఖ్యంగా పాత పౌరాణిక,జానపద సినిమాలు ఎక్కువగా చూసే సినిమా ప్రేక్షకులకు రావణుడు ఎలా ఉంటాడు అనేది కళ్ళలో మెదులుతూనే ఉంటుంది.అలాంటి సినిమా ప్రేక్షకులకు ఆదిపురుష్ సినిమా దర్శకుడు ఓం రౌత్ సైఫ్ అలీ ఖాన్ రూపంలో సరికొత్త రావణుడిని చూపించారు అని చెప్పచ్చు.హిందూ ప్రజలు అందరు కూడా ఈ సరికొత్త రావణుడిని జీర్ణించుకోలేకపోతున్నారు.ప్రముఖ కన్నడ నటి మరియు బిజెపి నాయకురాలు అయినా మాళవిక అవినాష్ సైతం ఆదిపురుష్ సినిమాలోని సరికొత్త రావణుడి పాత్ర విషయంలో ఫైర్ అయ్యారు.ప్రభాస్ అభిమానులతో పాటు ఇండియా లెవెల్ లో సినిమా ప్రేక్షకులు ఆదిపురుష్ టీసర్ కోసం ఆసక్తిగా ఎదురు చూసిన సంగతి అందరికి తెలిసిందే.హీరో ప్రభాస్ ను రాముడి పాత్రలో చూసేందుకు ఆయన అభిమానులు చాల ఆసక్తి చూపించారు.ఇక ఈ సినిమా టీజర్ పై కూడా ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి.

అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమా టీజర్ నిరాశపరిచింది అని వార్తలు వస్తున్నాయి.బాలీవుడ్ దర్శకుడు పాత్రల చిత్రీకరణ విషయంలో కాస్త బ్రాడ్ గా ఆలోచించారు అని అందరు భావిస్తున్నారు.హాలీవుడ్ లో ఉండే విధంగా పాత్రలను చిత్రీకరించారు దర్శకుడు.ఇక మోషన్ క్యాప్చర్ యానిమేషన్,నాణ్యత లేని విజువల్ ఎఫెక్ట్స్ సినిమా అభిమానులకు చిరాకు తెప్పించేలా ఉన్నాయి.ఇక లంకేశ్వరుడి పాత్ర సినిమా ప్రేక్షకులకు ఆగ్రహానికి గురి చేస్తుంది.పొట్టి ఉంగరాల జుట్టు,బాగా పెంచిన గడ్డం,కాటుక కళ్ళతో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ లంకేశ్వరుడి పాత్రను పోషించారు.ఈ సినిమాలో లంకేశ్వరుడి పాత్ర రావణాసురుడిలా కాకుండా అల్లావుద్దీన్ ఖిల్జీ లా ఉందంటూ చాల మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ పాత్రను ఉద్దేశించి ప్రముఖ కన్నడ నటి మరియు బిజెపి నాయకురాలు అయినా మాళవిక అవినాష్ ఈ సినిమా దర్శకుడి పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు.

రామాయణమును దర్శకుడు ఓం రౌత్ తప్పు దోవ పట్టిస్తున్నారని చెప్పుకొచ్చారు.మాళవిక గారు న్యూస్ ఏజెన్సీ అయినా ఏఎన్ఐ తో మాట్లాడుతూ వాల్మీకి రామాయణం,కంబ రామాయణం,తులసీదాస రామాయణం ఇలా రామాయణం గురించి చెప్పే చాల గ్రంథాలు మనకు అందుబాటులో ఉన్నాయి.అయితే వాటన్నిటిని దర్శకుడు పక్కనపెట్టడం నన్ను ఎంతగానో బాధించింది అని తెలిపారు.రామాయణం గురించి థాయిలాండ్ లో సైతం చాల అందమైన ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు.

తెలుగుతో పాటు తమిళ,కన్నడ సినిమాలు రామాయణం పై తెరకెక్కబడ్డాయి.మన సినిమాలను సైతం దర్శకుడు చూడలేకపోయారు అంటూ మాళవిక మండిపడ్డారు.ఇక రావణుడి పాత్ర ఎలా ఉంటుందో అని తెలుసుకోవడానికి భూకైలాష్ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర,డాక్టర్ రాజ్ కుమార్,సంపూర్ణ రామాయణంలో ఎస్పీ రంగారావు పాత్రలను చూసిన సరిపోయేది కదా అని చెప్పుకొచ్చారు.ఇక వైరల్ అవుతున్న ఈ సినిమాలోని రావణుడు నీలి కళ్ళ మేకప్ తో లెథర్ జాకెట్ వేసుకొని ఉన్నాడని,అతను భారతీయుడి లాగ కనిపించటం లేదని తెలిపారు.రామాయణం మన చరిత్ర అని అలాంటి గాధను క్రియేటివిటీతో అపవిత్రం చేయొద్దు అని కెజిఎఫ్ నటి మాళవిక సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *