కెజిఎఫ్ బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకొని ఇప్పుడు బాధపడుతున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా…

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కెజిఎఫ్ సృష్టించిన రికార్డుల గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కన్నడ వంటి చిన్న ఇండస్ట్రీ నుంచి ఎటువంటి అంచనాలు లేకుండా విడుదల అయినా కెజిఎఫ్ మొదటి భాగం సంచలన విజయం అందుకుంది.ఆ తర్వాత కెజిఎఫ్ రెండవ భాగం మీద భారీగానే సినీ ప్రేక్షకులలో అంచనాలు నెలకొన్నాయి.అంచనాలకు తగ్గట్టుగానే కెజిఎఫ్ ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసి ఇండియా లోనే టాప్ 2 హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.ఇటీవలే జక్కన్న దర్శకత్వం వహించిన ట్రిపుల్ సినిమా రికార్డులను కూడా క్రాస్ చేసి కెజిఎఫ్ రెండవ భాగం 1200 కోట్ల గ్రాస్ ని వాసులు చేసి కన్నడ సినిమా ఇండస్ట్రీకి ఇండియా లెవెల్ లో గుర్తింపు తీసుకొచ్చింది.కన్నడ స్టార్స్ గా ఉన్న ప్రశాంత్ నీల్ మరియు హీరో యశ్ కెజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.అయితే ఇంతటి ఘన విజయం సాధించిన ఈ సినిమా కథను మొదట దర్శకుడు బాలీవుడ్ హీరో అయినా హృతిక్ రోషన్ ను ఉహించుకొని రాసాడంట.అయితే మంచి పాపులారిటీ మరియు బాగా క్రేజ్ ఉన్న హృతిక్ రోషన్ ఈ సినిమా చేస్తే బాగుటుందని దర్శకుడు భావించారట.అప్పట్లో ఈ కథను హృతిక్ రోషన్ కు వినిపించడానికి దర్శకుడు ప్రశాంత్ నీల్ చాల ప్రయత్నాలు చేశారట.కానీ కనీసం హృతిక్ రోషన్ ను కలవడానికి అప్పోయిన్మెంట్ కూడా దొరకలేదట.

అయితే కనీసం హృతిక్ రోషన్ ను కలిసే అవకాశం కూడా దొరకకపోవడంతో కన్నడ హీరోతోనే ఈ సినిమా చేసి బ్లాక్ బస్టర్ కొట్టాలని ప్రశాంత్ నీల్ అనుకున్నారట.ప్రస్తుతం కెజిఎఫ్ 2 సంచలన విజయంతో బాలీవుడ్ మొత్తం ప్రశాంత్ నీల్ ను చూస్తుందని చెప్పచ్చు.ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో బాహుబలి 2 టాప్ 1 లో ఉండగా కెజిఎఫ్ 2 టాప్ 2 లో మరియు ఆర్ ఆర్ ఆర్ టాప్ 3 లో ఉన్నాయి.ఇండియా లోనే టాప్ 3 స్థానాలను దక్కించుకొని సౌత్ సినిమా ఇండస్ట్రీ సత్తా చాటారు మన సౌత్ దర్శకులు.ఏ హీరోలైతే సౌత్ ఇండస్ట్రీని చిన్న చూపు చూసారో ప్రస్తుతం వాళ్ళందరూ సౌత్ సినిమా ఇండస్ట్రీ దర్శకుల చుట్టే తిరుగుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *