సినిమా ఇండస్ట్రీలో హిట్ లు ప్లాప్ లు అనేవి సర్వసాధారణం.ఎలాంటి అంచనాలు లేకుండా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఒక్క సినిమా హిట్ అవడం తో స్టార్ డమ్ తెచ్చుకున్న వాళ్ళు చాల మందే ఇండస్ట్రీలో ఉన్నారు.ఏదైనా ఒక కథ ఒక హీరో దగ్గరకు వచ్చినప్పుడు అది హిట్ అవుతుందా లేదా అనేది నిర్ణయించటం చాల కష్టం.అలా ఒక మంచి కథను వదులుకున్న తర్వాత అది ఇండస్ట్రీ లో బిగ్గెస్ట్ హిట్ అయితే తర్వాత చాల బాధపడాల్సి వస్తుంది.హీరో నవదీప్ విషయం లోను అదే జరిగింది అని చెప్పచ్చు.సిద్దార్థ్,జెనీలియా జంటగా 2006 లో రిలీజ్ అయినా చిత్రం బొమ్మరిల్లు యెంత పెద్ద ఇండస్ట్రీ హిట్ అయిందో అందరికి తెలిసిందే.
ఆ చిత్రం తో యూత్ లో సిద్దార్థ్ కు ఫాలోయింగ్ పెరిగిపోయింది.అలాగే హాసిని క్యారక్టర్ లో జెనీలియా నటన ప్రేక్షకులకు ఎప్పటికి గుర్తుండి పోతుంది.బొమ్మరిల్లు హిట్ తర్వాత హీరో సిద్దార్థ్ కు మరియు జెనీలియా కు అవకాశాలు క్యూ కట్టాయి.ఈ సినిమా ను డైరెక్ట్ చేసిన భాస్కర్ కూడా రామ్ చరణ్ తో ఆరంజ్ సినిమా ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు.ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు ఇప్పటికి వినిపిస్తూనే ఉంటాయి.ఆరు కోట్ల బడ్జెట్ తో తెరకెక్క బడిన ఈ చిత్రం 50 కొట్ల వసూళ్లు రాబట్టింది.ఈ చిత్రం దిల్ రాజు కు భారీ లాభాలు రాబట్టింది.అయితే ఈ బొమ్మరిల్లు చిత్రం కథను మొదట దిల్ రాజు భాస్కర్ హీరో నవదీప్ కు వినిపించారు.
నవదీప్ ను దిల్ రాజు ఈ చిత్రం తో తెలుగు ఇండస్ట్రీ కి హీరోగా పరిచయం చేయాలనీ అనుకున్నారు.కానీ అప్పటికే జై అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నవదీప్ గౌతమ్ ఎస్ ఎస్ సి,మొదటి సినిమా,ప్రేమంటే ఇంతే అనే సినిమాలతో బిజీ గా ఉన్నాడు.దాంతో నవదీప్ బొమ్మరిల్లు చిత్రానికి నో చెప్పడం జరిగింది.నవదీప్ నటించిన అన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయి అదే టైములో బొమ్మరిల్లు చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.ఈ చిత్రాన్ని మిస్ చేసుకున్నాడు ఎప్పుడు బాధపడుతూనే ఉంటాను అని నవదీప్ చాల సందర్భాలలో తెలిపారు.ఒకవేళ నవదీప్ బొమ్మరిల్లు చేసి ఉంటె హీరోగా అతని కెరీర్ మరి కొన్ని రోజు లు ఉండేది అని చెప్పచ్చు.