Bro Movie Review: బ్రో మూవీ రివ్యూ..సినిమా ఎలా ఉందంటే

NEWS DESK
2 Min Read

Bro Movie Review: పవన్ కళ్యాణ్ సినిమాలపై ప్రేక్షకులలో ఎప్ప్పుడు అంచనాలు భారీగా నెలకొంటాయి.ఇక పవన్ కళ్యాణ్,సాయిధర్మతేజ్ కాంబినేషన్ లో సినిమా అవడంతో ఈ సినిమా మీద ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది.ఈ సినిమా ఎలా ఉంది…దేవుడిగా పవన్ కళ్యాణ్ ఎలా మెప్పించారు అనేది తెలుసుకుందాం.

మూవీ:బ్రో

నటీనటులు: పవన్ కళ్యాణ్,సాయిధరమ్ తేజ్,కేతిక శర్మ,ప్రియా ప్రకాష్ వారియర్,వెన్నెల కిషోర్ తదితరులు.

మ్యూజిక్:తమన్

నిర్మాత:టిజి విశ్వప్రసాద్

దర్శకుడు:సముద్రఖని

స్క్రీన్ ప్లే,డైలాగ్స్:త్రివిక్రమ్

కథ:మార్కండేయులు అంటే సాయిధరమ్ తేజ్ ఒక టెక్స్టైల్ కంపెనీ లో ఉద్యోగం చేస్తూ ఉంటాడు.చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం మొత్తం తనపైనే ఉంటుంది.దాంతో అమ్మ అంటే రోహిణి ని,చెల్లెలు ప్రియా ప్రకాష్ వారియర్ ను దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు.ఈయనకు రమ్య అంటే కేతిక శర్మ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది.తన బాధ్యతలు అన్ని పూర్తి అయినా సమయంలో పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు.సరిగ్గా అదే సమయంలో తన పుట్టిన రోజు నాడు ఆక్సిడెంట్ లో చనిపోతాడు.అప్పుడే మార్కండేయులు జీవితంలోకి వస్తాడు టైమ్ అంటే పవన్ కళ్యాణ్.తనకు అప్పుడే చనిపోవాలని లేదని ఇంకాస్త టైమ్ కావాలని టైమ్ ను అడుగుతాడు మార్క్.దాంతో టైమ్ అతనికి మరొక ఛాన్స్ ఇస్తాడు.ఇక ఆ తర్వాత మార్క్ బతికినా తర్వాత ఏం చేసాడు అనేది మిగిలిన కథ.

కథనం:ఈ సినిమాలో పాటలు,కామెడీ,ఫామిలీ ఎమోషన్స్ అన్ని ఉన్నాయని తెలుస్తుంది.మంచి కథ కూడా ఉన్న ఈ సినిమాలో ప్రేక్షకులకు ఇంతకంటే ఇంకేం కావాలి.సముద్రఖని,త్రివిక్రమ్ కలిసి ఒక మంచి ఫామిలీ సినిమాను ప్రేక్షకులకు అందించారు.
నటీనటుల పనితీరు:టైమ్ పాత్రలో అద్భుతమైన స్క్రీన్ ప్రెజన్స్,కామెడీ టైమింగ్ తో పవన్ కళ్యాణ్ అదరగొట్టేసాడు.మొదటి పది నిముషాలు తప్పించి మిగిలిన సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ కనిపించారు.సాయిధరమ్ తేజ్ మరోసారి తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు.కేతిక శర్మ కూడా బాగానే ఆకట్టుకుంది.మిగిలిన అందరు కూడా తమ పాత్రలతో బాగా మెప్పించారు.

టెక్నికల్:పాటలు అంతగా ఆకట్టుకోకపోయిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.పవన్ వచ్చినప్పుడల్లా బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది అని చెప్పచ్చు.సినిమాటోగ్రఫీ,ఎడిటింగ్ బాగున్నాయి.ప్రతి ఒక్కరు జీవితంలో పరుగెడుతూ ప్రస్తుతం ఉన్న క్షణాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు.దీనినే ఈ సినిమాలో సముద్ర ఖని చాల చక్కగా చూపించడం జరిగింది.ఇక వీటికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే,డైలాగ్స్ కూడా ప్లస్ అయ్యాయి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *