Bro Collections: పవన్ కళ్యాణ్,సాయిధరమ్ తేజ్ ముల్టీస్టారర్ గా తాజాగా రిలీజ్ అయినా సినిమా బ్రో.తమిళ్ సినిమా అయినా వినోదయ సీతం ను తెలుగులో మార్పులు చేర్పులు చేసి తెలుగు లో తెరకెక్కించారు దర్శకుడు సముద్రఖని.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ప్లే,మాటలు అందించిన ఈ సినిమాలో మొదటి సారి మేనమామ,మేనల్లుడు కలిసి నటించారు.జులై 28 న రిలీజ్ అయినా ఈ సినిమా మొదటిరోజే పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
రెండవ రోజు కూడా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతున్న ఈ సినిమా మొదటి రోజు తో పోలిస్తే కొంచెం డీలా పడింది అని తెలుస్తుంది.రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకు మొదటి రోజు 23 .61 కోట్లు వసూలు రాబట్టింది.రెండో రోజు ఇందుకు సగం మాత్రమే వసూళ్లు రాబట్టింది.రెండవ రోజు ఈ సినిమా 10 .47 కోట్లు రాబట్టింది.రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమా రెండు రోజుల్లో 34 .08 కోట్లు వసూళ్లు రాబట్టింది.52 .50 కోట్లు గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు సమాచారం.రెండవ రోజు ఏరియా వైస్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి.నైజం:4 .80 కోట్లు,సీడెడ్:1 .31 కోట్లు,ఉత్తరాంధ్ర:1 .48 కోట్లు,తూర్పు గోదావరి:68 లక్షలు,పశ్చిమ గోదావరి:37 లక్షలు,గుంటూరు:74 లక్షలు,కృష్ణ:76 లక్షలు,నెల్లూరు:33 లక్షలు.