కమర్షియల్ డైరెక్టర్ లలో ఒకరైన పూరీజగన్నాధ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు.వరుసగా ఎన్ని ప్లాప్ లు పడిన కూడా ఆయన సినిమా వస్తుంది అంటే చాల ప్రేక్షకులు థియేటర్ లకు క్యూ కడతారు.అయితే వరుసగా ప్లాప్ లతో సతమతమవుతున్న సమయంలో మల్లి ఆయనకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టి లాభాల బాట పట్టించిన చితం స్మార్ట్ శంకర్.ఈ హిట్ సినిమాతో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది అని చెప్పచ్చు.ఇటీవలే పూరీజగన్నాధ్ హీరో విజయదేవరకొండ తో పాన్ ఇండియా లెవెల్ లో లైగర్ చిత్రాన్ని తెరకెక్కించారు.ఇది ఇలా ఉంటె పూరీజగన్నాధ్ మొదటి సినిమా బద్రి ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే.పూరీజగన్నాధ్ గారికి బద్రి మొదటి సినిమా కానీ ఈ సినిమా తీయడానికి అవకాశం మాత్రం ఇట్లు శ్రావణి సుభ్రమణ్యం స్టోరీ అని చెప్పచ్చు.
వివరంగా చెప్పాలంటే..ఒక దర్శకుడు అప్పట్లో పవన్ కళ్యాణ్ గారికి కథ వినిపించాలి అంటే ముందుగా పవన్ కళ్యాణ్ మేనేజర్ అపాయింట్మెంట్ తీసుకోని అతనికి కథ వినిపించాలి.మేనేజర్ కి కథ నచ్చితేనే పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు అనుమతి ఇస్తారు.అయితే మేనేజర్ కి బద్రి కథ నచ్చుతుందో లేదో అని ఇట్లు శ్రావణి సుభ్రమణ్యం స్టోరీ ని పూర్ జగన్నాధ్ వినిపించారు.ఈ స్టోరీ మేనేజర్ కు బాగా నచ్చడంతో పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు అనుమతి ఇచ్చారు.అయితే పవన్ కళ్యాణ్ కు మాత్రం పూరీజగన్నాధ్ బద్రి కథను వినిపించారు.ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఓకే చెప్పడం తో బద్రి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.
ఇది ఇలా ఉంటె పూరీజగన్నాధ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసుతున్న సమయంలోనే ఇట్లు శ్రావణి సుభ్రమణ్యం స్టోరీ ను రెడీ చేసుకున్నారు.అప్పట్లో ఈ స్టోరీ తో సీరియల్ చేయాలనీ దూరదర్శన్ ఛానెల్ చుట్టూ ప్రదిక్షణలు కూడా చేసేవారు పూరీజగన్నాధ్.ఆ ఛానెల్ ఒప్పుకోకపోవడం తో సీరియల్ వెర్షన్ ని సినిమా వెర్షన్ గా మార్చారు పూరి.ఈ సినిమా కథను ముందు సుమంత్ కు వినిపించారు.కానీ ఆయన కథ నచ్చక రిజెక్ట్ చేయడంతో తరుణ్ ను పెట్టి తీద్దాం అని అనుకున్నారు.కాని చివరకు అప్పుడే హీరోగా ఎదుగుతున్న రవి తేజ ను పెట్టి ఈ సినిమా చేసారు పూరీజగన్నాధ్.అప్పట్లో రిలీజ్ అయినా ఈ చిత్రం సెన్సషనల్ హిట్ గా నిలిచింది.కథ పరంగా,మ్యూజిక్ పరంగా సూపర్ హిట్ అయ్యింది.