తన చుట్టూ ఉన్న అన్ని బ్యాండ్ వాయిద్యాలను వాయిస్తూ మతి పోగొడుతున్న శునకం…వీడియోకు ఫిదా అవుతున్న నెటిజన్లు….

ప్రపంచంలో నలుమూలల ఏ చిన్న విషయం అయినా కూడా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి క్షణాలలో వైరల్ అయిపోతుంది.అలా వైరల్ అయినా వీడియోలలో కొన్ని ఫన్నీ గా ఉంటె మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగించేవిగా ఉంటాయి.ఇలా ప్రతి రోజు వైరల్ అయ్యే వీడియోలలో జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా చాలానే వైరల్ అవుతున్నాయి.జంతువులూ అంటే ఇష్టపడే వారికీ ఈ వీడియోలు బాగా ఆకట్టుకుంటున్నాయి.ఇటీవలే ఒక శునకం బ్యాండ్ వాయించిన వీడియొ ఒకటి సోషల్ మీడియాలో చాల ఫాస్ట్ గా వైరల్ అవుతుంది.

ఈ వీడియోలో ఒక శునకం తన చుట్టూ ఉన్న అన్ని వాయిద్యాలను వాయిస్తూ అందరి మతిని పోగొడుతుంది.ఈ వీడియొ చూసిన నెటిజన్లు ఇది నిజంగా సాధ్యమేనా అంటూ ఆశ్చర్యపోతున్నారు.తెలివైన కుక్క అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.వైరల్ అయినా ఈ వీడియోపై జాతీయ లోక్ దళ్ జాతీయ అధ్యక్షుడు జయంత్ చౌతాలా స్పందిస్తూ టామీ బ్యాండ్ వాలా అంటూ కామెంట్ చేసారు.

ఈ వీడియోలో శునకం స్టైల్ గా తన చుట్టూ ఉన్న అన్ని వాయిద్యాలను వాయించడం గమనించవచ్చు.శునకం బ్యాండ్ వాయించే ఈ వీడియొ @TheDeshBhakt అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయబడింది.అత్యధిక వ్యూస్ తో మరియు కామెంట్స్ తో ఈ వీడియొ వైరల్ అవుతుంది.చాల తెలివైన శునకం,శునకం తెలివికి ఫిదా అంటూ చాల మంది కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *