రాను రాను ధరలు పెరుగుతుండడంతో సామాన్య జనాలపై భారం బాగా పడుతుంది.నిత్యావసరాల ధరలతో పాటు ఇతర వస్తువుల ధరలు కూడా పెరుగుతుండడంతో సామాన్యులపై భారం మరింత ఎక్కువైంది.కొత్త ఇల్లు కట్టుకోవాలి అనుకున్నవారికి సిమెంట్ ధరల పెరుగుదల మరింత ప్రభావం చూపిస్తుంది.ఇటీవలే ప్రముఖ సిమెంట్ కంపెనీ అయినా ఇండియా సిమెంట్స్ సిమెంట్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించారు.ఆయా కంపెనీలు జులై నెల నుంచి విడత వారీగా ధరలను పెంచేందుకు సిద్ధం గా ఉన్నాయి.
రూ.55 మేర ఈ ధరలు పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.వీటికి కారణం ముడి పదార్ధాల ధరలు పెరగడం మరియు ఉత్పత్తి వ్యయాలు పైకి చేరడం అని కంపెనీలు పేర్కొంటున్నాయి.సిమెంట్ బస్తా రేటు జులై 1 నుంచి రూ 20 పెరుగుతున్నట్లు సమాచారం.మొత్తంగా సిమెంట్ బస్తా రేటు రూ 55 పెరుగుతున్నట్లు తెలుస్తుంది.

కొత్తగా ఇల్లు కట్టునే వారి మీద ఇది ప్రభావం చూపనుంది.దీని ప్రభావం సిమెంట్ అమ్మకాలపై కూడా పడనుంది.కంపెనీ నష్టాలూ 2021 -2022 నాలుగో త్రైమాసికంలో రూ 230 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం.ఇదే త్రైమాసికంలో గత ఆర్ధిక సంవత్సరంలో రూ 71 .6 కోట్లు లాభాలు నమోదు అయినట్లు సమాచారం.