Chandramukhi 2 Collections: పి.వాసు దర్శకత్వంలో రాఘవ లారెన్స్ హీరో గా నటించిన లేటెస్ట్ సినిమా చంద్రముఖి 2 థియేటర్లలో రిలీజ్ అయినా సంగతి తెలిసిందే.సుభాస్కరన్ ఈ సినిమాను లేక ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు.కంగనా రనౌత్,మహిమ నంబియార్ హీరోయిన్లుగా నటించారు.ఇక రాధికా శరత్ కుమార్,లక్ష్మి మీనన్,సుభిక్ష,వడివేలు,రావు రమేష్ కీలక పాత్రలలో కనిపించారు.రజనీకాంత్ హీరోగా 2005 లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయినా చంద్రముఖి సినిమాకు రెండవ భాగంగా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు.
దాంతో ఈ సినిమా మీద ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి.టీజర్,ట్రైలర్స్ అంతగా ఇంప్రెస్ చేయలేకపోయినా కూడా చంద్రముఖి సినిమా అభిమానులు ఈ సినిమా కోసం ఎంతోఆసక్తిగా ఎదురు చూసారు.సినిమా రిలీజ్ అయినా మొదటి రోజే ఈ సినిమాకు నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది.దాంతో ఆశించిన స్థాయిలో ఈ సినిమాకు కలెక్షన్లు రాలేదు.చంద్రముఖి 2 మూడు రోజుల కలెక్షన్లు ఎంతంటే..నైజం:0 .96 cr ,సీడెడ్:0 .43 cr ,ఉత్తరాంధ్ర:0 .29 cr ,ఈస్ట్:0 .22 cr ,వెస్ట్:0 .17 cr ,గుంటూరు:0 .22 cr ,కృష్ణ:0 .21 cr ,నెల్లూరు:0 .14 కేర్,ఏపీ మరియు తెలంగాణ:2 .68 cr .ఈ సినిమాకు తెలుగు లో రూ.9 .4 కోట్లు థియరిటికల్ బిజినెస్ జరిగింది.బ్రేక్ ఈవెన్ కు ఈ సినిమా రూ.10 కోట్లు రాబట్టాలి.ఇక మూడు రోజులకు ఈ సినిమా 2 .68 కోట్లు రాబట్టి పర్వాలేదు అనిపిస్తుంది.