Home » తాజా వార్తలు » Chandrayaan-3: చల్లటి చందమామ గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టిన విక్రమ్ లాండర్ లోని చాస్ట్

Chandrayaan-3: చల్లటి చందమామ గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టిన విక్రమ్ లాండర్ లోని చాస్ట్

Chandrayaan 3

Chandrayaan 3: విక్రమ్ లాండర్ చంద్రుడిపై దిగి నాలుగు రోజులు అయినా సంగతి అందరికి తెలిసిందే.అయితే దీనిలో అమర్చబడిన చాస్ట్ అనే పరికరం తన పనిని మొదలుపెట్టింది.ఉష్ణోగ్రతను కొలవడానికి అమర్చినా ఈ పరికరం లో పది ప్రయేక థర్మామీటర్ల సెన్సార్ లు ఉన్నాయి.ప్రపంచం లోని ఏ అంతరిక్ష పరిశోధన సంస్థ ద్వారా కూడా తెలియని చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద మొదటి ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.ఇక ఇస్రో చాస్ట్ పరికరం నుంచి మరింత సమాచారం కోసం ఎదురు చూస్తుంది.చంద్రుడైనా చల్లటి చందమామ గా కవులు కీర్తించే సంగతి అందరికి తెలిసిందే.అయితే భూమి కంటే కూడా చంద్రుడు వేడిగా ఉంటాడనే ఆశ్చర్యకరమైన వాస్తవం ఇప్పుడు బయటపడింది.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మొదటి సరిగా ప్రపంచ అంతరిక్ష చరిత్రలో చంద్రుడి దక్షిణ ధ్రువం దగ్గర ఉష్ణోగ్రతను కొలిచింది.ఇటీవలే చంద్రయాన్ 3 లో పంపిన విక్రమ్ లాండర్ లోని చాస్ట్ ఉష్ణోగ్రత కొలిచే పరికరం చంద్రుడి దక్షిణ ధ్రువం దగ్గర 70 డిగ్రీ ల సెల్సియస్ ఉష్ణోగ్రత దగ్గర,10 సెంటీమీటర్ల దిగువన ఉన్న మట్టిని పరిశీలించడం జరిగింది.-10 డిగ్రీ ల సెల్సియస్ లోటు వద్ద వేడిగా ఉందని తెలిపారు.భారత్ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ చంద్రయాన్ 3 లో చంద్రుడి వాతావరణానికి సంబంధించిన వాస్తవాలు భారీర్గతం అవుతున్నాయి.

విక్రమ్ లాండర్ లోని చాస్ట్ సహాయంతో ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రుడి ఉష్ణోగ్రతా యెంత…అది ఎలా మారుతుంది అనే సమాచారాన్ని తెలిపారు.విక్రమ్ లాండర్ లోని చాస్ట్ పరికరం ద్వారా పంపించిన చంద్రుడి మట్టి ఉష్ణోగ్రతను గ్రాఫ్ తో పాటు ఇస్రో ట్వీట్ చేసింది.అయితే చాస్ట్ పంపిన సమాచారం ప్రకారం చంద్రుడి దక్షిణ ధ్రువం దగ్గర నెల లోతుగా ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది.ఇక నెల ఉపరితలం,దిగువ మధ్య ఉష్ణోగ్రత లో భారీ వ్యత్యాసం ఉన్నట్లు తెలుస్తుంది.వార్త సంస్థ తో ఇస్రో శాస్త్రవేత్త బిహెచ్ఎం దారుకేశ మాట్లాడుతూ చంద్రుడి ఉపరితలం మీద ఉష్ణోగ్రత 20 నుంచి 30 డిగ్రీ ల సెల్సియస్ గా ఉంటుందని మేము ఊహించడం జరిగింది.

కానీ చాస్ట్ పంపిన సమాచారం ప్రకారం చంద్రుడి ఉపరితలం మీద ఉష్ణోగ్రత 70 డిగ్రీ ల సెల్సియస్ గా ఉందని తేలింది.మేము అనుకున్న దానికంటే ఇది చాల ఆశ్చర్య కరంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.భూమి మీద భూగర్భం,ఉపరితలం ఉష్ణోగ్రత 2 లేదా 3 డిగ్రీ ల సెల్సియస్ ఉష్ణోగ్రత వ్యత్యాసం ఉంటుంది.కానీ చంద్రుడి లో ఈ మొత్తం 50 డిగ్రీ ల సెల్సియస్ కంటే ఎక్కువ.ఇది చాల ఆసక్తికరమైన విషయం అంటూ ఇస్రో శాస్త్రవేత్త తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *