చాల మందికి కలలో తరచుగా చనిపోయిన కుటుంబ సభ్యులు కానీ లేదా సన్నిహితులు కానీ పదే పదే కనిపిస్తుంటారు.ఇలా తరచుగా కలలో చనిపోయిన వాళ్ళు కనిపించటం వలన చాల మంది భయాందోళనకు గురవుతుంటారు.ఇలా చనిపోయిన వాళ్ళు కలలో కనిపించటానికి గల కారణాలు ఏంటి అంటే..స్వప్న శాస్త్రం ప్రకారం చనిపోయిన వాళ్ళు ఎవరి కలలో అయినా తరచుగా కనిపిస్తున్నారు అంటే వారి ఆత్మా ఇంకా ఈ లోకంలోనే సంచరిస్తుందని అర్ధం.చనిపోయిన వాళ్ళ ఆత్మలో కలలో కనిపించినప్పుడు కొన్ని నియమాలు పాటిస్తే మంచి జరుగుతుంది అని పండితులు చెప్తున్నారు.
ఇలా చనిపోయిన వాళ్ళు కలలో కనిపించినప్పుడు వారి పేరున రామాయణం,భగవత్ గీత వంటి పురాణాలూ చదవాలని పండితులు సూచిస్తున్నారు.చనిపోయిన వాళ్ళు మన కలలో ఎంతో బాధతో ఏమి మాట్లాడకుండా కనిపిస్తే మీరు ఏదో తప్పు చేయబోతున్నారు అని సంకేతమట.అలాగే చనిపోయిన మన బంధువులు కానీ సన్నిహితులు కానీ కలలో ఆకలితో కనిపిస్తే వెంటనే పేదలకు అన్నదానం చేస్తే వారి ఆత్మా సంతోషపడుతుందట.చనిపోయిన వారు కోపంతో కలలో కనిపిస్తే వారు మీ నుంచి ఏదో ఆశిస్తున్నారు అని అర్ధమట.
అప్పుడు వాళ్ళు కలలో చెప్పిన విధంగా చేస్తే వారి ఆత్మా సంతృప్తిచెందుతుందని పండితులు చెప్తున్నారు.మరికొన్ని సార్లు చనిపోయిన బంధువులు కానీ సన్నిహితులు కానీ కలలో సంతోషంగా నవ్వుతు కనిపిస్తారు.ఇలా కనిపించటం వలన అన్ని శుభాలు కలుగుతాయి అని పండితులు చెప్తున్నారు.కొంత మంది తీరని కోరికలతో చనిపోయిన వారు కూడా ఉంటారు.కాబట్టి స్వప్న శాస్త్రం ప్రకారం కలలో ఎవరైనా ఏదైనా చెయ్యమని కోరితే వారి ఆత్మా సంతృప్తి చెంది ఈ లోకాన్ని విడిచి వెళ్తుందని పండితులు సూచిస్తున్నారు.