ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్యారక్టర్ ఆర్టిస్ట్ లలో నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈమె చాల సినిమాలలో హీరో లేదా హీరోయిన్ కు తల్లిగా,అత్తగా నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.ఎమోషనల్ పాత్రలతో పాటు కామెడీ పాత్రలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.ప్రగతి ఎన్టీఆర్ బాద్షా సినిమాలో ఒక పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసి అందరిని ఆశ్చర్యపరిచింది.రాజా ది గ్రేట్ సినిమాలో కూడా ఒక పాటకు సందడి చేసింది.సోషల్ మీడియాలో ఎక్కువగా ఆక్టివ్ గా ఉండే ప్రగతి తన ఫిట్నెస్ వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది.
చెమటలు పట్టేలా వర్క్ అవుట్ లు చేస్తున్న వీడియోలు,హాట్ హాట్ గా డాన్స్ చేస్తున్న వీడియోలు షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటూ ఉంటుంది.సోషల్ మీడియాలో ఈమెకు బాగానే ఫాలోయింగ్ ఉందని చెప్పచ్చు.ఈమెను ప్రగతి ఆంటీ అని నెటిజన్లు పిలుచుకుంటూ ఉంటారు.
అయితే ఈమె మాత్రం విమర్శలకు దూరంగా ఉంటూ తనకు నచ్చినట్లు చేస్తూ ఉంటుంది.ఇటీవలే ఈమె టీవీ షో అయినా జబర్దస్త్ షో లో కూడా పాల్గొని సందడి చేసిన సంగతి తెలిసిందే.
ఇదంతా పక్కన పెడితే చాల మంది సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ముందు హీరో లేదా హీరోయిన్ అవ్వాలనే కోరికతోనే వస్తారు.అయితే ఏపీ లోని ఒంగోలు జిల్లాకు చెందిన ప్రగతి సినిమాల మీద ఇష్టంతో మోడలింగ్ చేసింది.
అయితే ఈమె ఒక్కప్పుడు తమిళ దర్శకుడు భారతి రాజా సినిమాలో హీరోయిన్ నటించింది.వీట్ల విదేశంగా సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ప్రగతి.హీరోయిన్ గా సక్సెస్ అవ్వలేకపోయిన కూడా క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రం ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.ఇటీవలే ఎఫ్ 2 మరియు ఎఫ్ 3 సినిమాలతో కూడా ప్రేక్షకులను బాగా అలరించింది.