20 ఏళ్ళు కష్టపడి సంపాదించినా ఆస్తి మొత్తం ఒక్క సినిమాతో పోయింది అంటూ ఎమోషనల్ అయినా ఛార్మి….

ఇటీవలే పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం లైజర్ రిలీజ్ అయినా సంగతి అందరికి తెలిసిందే.ఈ సినిమా రిలీజ్ అయినప్పటినుంచి కూడా నెగటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమా ఎలా ఉంది అనే దానికన్నా ఈ సినిమా యెంత ఘోరంగా పరాజయం పొందింది అనే దాని మీద ఎక్కువగా చర్చ జరుగుతుంది.సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్ ఓ రేంజ్ లో జరిగిన సంగతి అందరికి తెలిసిందే.కానీ సినిమా రిలీజ్ అయినా తర్వాత మాత్రం పరిస్థితులు సోషల్ మీడియా లో పాతాళానికి తోసేలా ఉన్నాయని చెప్పచ్చు.

ఇక ఈ మధ్యకాలం లో విజయదేవరకొండ సినిమాలు వరుసగా ప్లాప్ అవుతున్న నేపథ్యంలో భారీ అంచనాలతో రిలీజ్ అయినా లైగర్ సినిమా పరాజయం అటు బాలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ ను కూడా షాక్ కు గురి చేస్తుంది.సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్ ఓ రేంజ్ లో జరగడంతో మరింత ట్రోలింగ్ కు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇక లైగర్ సినిమాకు బాలీవుడ్ లో కరణ్ జోహార్ సహా నిర్మాతగా ఉన్నారు.ఇక తెలుగులో ఈ సినిమాకు ఛార్మి మరియు పూరీజగన్నాధ్ నిర్మాతలుగా ఉన్నారు.

ఈ సినిమా ప్లాప్ దర్శకుడు పూరీజగన్నాధ్ పై తీవ్రంగానే ప్రభావం చూపుతుందని తెలుస్తుంది.ఇక పూరీజగన్నాధ్ మీద నమ్మకం పెట్టుకున్నందుకు ఛార్మి కూడా నిండా మునిగింది అనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.ఇక ఈ సినిమా రిలీజ్ అయినా మొదటి షో కే రిసల్ట్ తెలియడంతో ఛార్మి తన సన్నిహితుల దగ్గర ఎమోషనల్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమా దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయల నష్టాన్ని ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.ఇక ఛార్మి తానూ ఇరవై ఏళ్లుగా ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి కూడగట్టిన ఆస్తులను ఇలా లైగర్ సినిమా రూపంలో పూర్తిగా కోల్పోయినట్లు తన సన్నిహితుల దగ్గర చెప్పుకొని భాధపడిందట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *