సినిమాలలో చాల మంది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇస్తారు కాని వాళ్లలో కొంత మంది మాత్రమే మంచి గుర్తింపును సంపాదించుకుంటారు.కొంత మంది చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది ఒకటి రెండు సినిమాలే అయినా కూడా తమ పాత్రలతో ప్రేక్షకులకు ఎప్పటికి గుర్తుండిపోతారు.అలా ప్రేక్షకులకు ఎప్పటికి గుర్తుండిపోయే పాత్రలలో ప్రభాస్ ఛత్రపతి సినిమాలో సూరీడు పాత్ర కూడా ఒకటి అని చెప్పచ్చు.ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించిన ఛత్రపతి సినిమా ఘనవిజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే.
ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా శ్రియ నటించడం జరిగింది.ఇక ఈ సినిమాలో హీరో ప్రభాస్ ను హైలెట్ చేసే ఒక సీన్ లో సూరీడు అనే పాత్ర కనిపిస్తుంది.కళ్ళు లేని తన తల్లి సూరీడు సూరీడు అని పిలుస్తూ ఉంటుంది అదే సమయంలో కాట్రాజు వచ్చి సూరీడుని చితకబాది కింద పడేస్తాడు.అదే సమయంలో ప్రభాస్ వచ్చి ఆ సూరీడుని కాపాడే సీన్ ఈ సినిమాకు హైలెట్ అని చెప్పచ్చు.ఈ సీన్ లో సూరీడు పాత్రలో అద్భుతంగా నటించిన పిల్లవాడి పేరు భష్వంత్.

ఇక ఈ సినిమా తర్వాత భష్వంత్ కు వేరే సినిమాలతో అంతగా గుర్తింపు రాలేదు అని చెప్పచ్చు.ఛత్రపతి సినిమాతో భష్వంత్ సూరీడు పాత్రలో ప్రేక్షకులకు ఇప్పటికి బాగా గుర్తుండిపోతాడు.ఇప్పటికి సోషల్ మీడియాలో సూరీడు పేరు తో మీమ్స్ కనిపిస్తున్నాయి అంటే ఈ పాత్ర ప్రేక్షకులపై యెంత ప్రభావం చూపించిందో తెలుస్తుంది.ప్రస్తుతం పెరిగి పెద్దవాడైన భష్వంత్ హీరోల మారిపోయాడు.అతనికి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.దింతో ఛత్రపతి సూరీడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు అనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.