చీరాల బీచ్ లో ఫ్యామిలీతో కలిసి సందడి చేసిన బాలయ్య…వీడియొ వైరల్…


నందమూరి బాలకృష్ణ  సినిమాలతో బిజీ గా ఉంటూనే తన ఫ్యామిలీ కి కూడా సమయం కేటాయిస్తుంటారు.ఇటీవలే బాలకృష్ణ,బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన్న అఖండ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయినా సంగతి అందరికి తెలిసిందే.మరోపక్క అన్ స్టాపబుల్ షో నుంచి కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.దింతో ఫుల్ జోష్ మీద బాలకృష్ణ గారు సంక్రాంతి సంబరాలను తన ఫ్యామిలీ తో కలిసి ఓ రేంజ్ లో జరుపుకుంటున్నారు.ప్రస్తుతం బాలకృష్ణ భార్య వసుంధర మరియు కొడుకు మోక్షజ్ఞ తో కలిసి ప్రకాశం జిల్లాలో ఉన్నారు.

అక్కడ కారంచేడు లోని తన సోదరి,కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ఇంట్లో తన ఫ్యామిలీ తో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు.ఈ పండుగా సందర్భంగా శుక్రవారం భోగి పండుగా నాడు గుర్రపు స్వారీ చేసారు బాలయ్య.అలాగే శనివారం జరిగిన సంక్రాంతి పండుగ రోజు తన ఫ్యామిలీ తో కలిసి ఆనందంగా గడిపారు.తాజాగా తన భార్య వసుంధరతో కలిసి చీరాల బీచ్ లో సందడి చేసారు బాలయ్య.

బాలయ్య టాప్ లెస్ ఫోర్డ్ జీపులో తన భార్య వసుంధరను పక్కన కూర్చోపెట్టుకొని బీచ్లో సందడి చేసారు.అనంతరం బీచ్లో తన ఫ్యామిలీ తో కలిసి కొంచెం సేపు గడిపారు బాలయ్య.భోగి రోజున బాలయ్య గుర్రం పై స్వారీ చేయడం అందరిని ఆకట్టుకుంది.గుర్రంతో బాలయ్య డాన్స్ చేయించిన తీరు అందరి దృష్టిని బాగా ఆకట్టుకుంటుంది.గుర్రంపై బాలయ్య ఫుల్ జోష్ తో కనిపించారు.కుటుంబసభ్యులు బాలయ్య ను ప్రోత్సహించారు.అలాగే మరోపక్క అభిమానులు కూడా జై బాలయ్య అంటూ హోరెత్తించారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *