చిరంజీవి కెరీర్ లో ఇప్పటి వరకు ఆ అక్షరంతో వచ్చిన సినిమాలు ఎన్నో తెలుసా…వాటిలో ఏది హిట్…ఏది ప్లాప్ అంటే…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి కి ప్రత్యేక స్తానం ఉందని చెప్పచ్చు.ప్రేక్షకులలో ఆయనకు ఉన్న క్రేజ్ గురించి ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకొని ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు చిరంజీవి.ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా సంచలన విజయాలను సొంతం చేసుకున్నారు.అయితే కొన్ని కొన్ని సార్లు ఆయన కొంచెం భిన్నంగా ట్రై చేసిన సినిమాలు మాత్రం నిరాశపరిచాయి అని చెప్పచ్చు.

ఇప్పటి వరకు చిరంజీవి గారు తన కెరీర్ లో చేసిన 152 సినిమాలలో ఆ అక్షరం తో చేసిన సినిమాలు అచ్చురాలేదంటే నమ్మశక్యం కాదని చెప్పచ్చు.చిరంజీవి గారు ఆ అక్షరంతో మొదట చేసిన సినిమా ఆరని మంటలు.ఇంకా ఇమేజ్ రాని సమయంలో చేసిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది.ఆ తర్వాత ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలో చిన్న పాత్ర లో నటించడం జరిగింది.అయితే ఈ సినిమా యావేరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.ఇక చిరంజీవి గారు నటించిన ఆలయ శిఖరం కూడా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

భారీ అంచనాలతో తమిళ్ డైరెక్టర్ భారతీరాజా తో చిరంజీవి గారు చేసిన సినిమా ఆరాధనా చిరంజీవి గారికి నటన పరంగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ప్లాప్ టాక్ ను తెచ్చుకుంది.ఇక కె విశ్వనాధ్ గారి ఆపద్బాంధవుడు సినిమా అవార్డులు సొంతం చేసుకుంది కానీ కలెక్షన్లు సాధించలేకపోయింది.ఇక హిందీ లో చేసిన ఆజ్ కా గూండారాజ్ అనే చిత్రం హిట్ అవ్వడం జరిగింది.ఇక ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆచార్య సినిమా కూడా నిరాశ పడేలా చేసింది.అయితే మొదటి అ అక్షరంతో వచ్చిన అడవి దొంగ ,అల్లుడా మజాకా,అన్నయ్య సినిమాలు హిట్ అవ్వడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *