మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఆయన ఆరు పదుల వయస్సులో ఉన్నప్పటికీ ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటూ ఎల్లప్పుడూ హుషారుగా ఉంటారు.నేటి తరం హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నారు చిరంజీవి.ఒకపక్క సినిమాలతో బిజీ గా ఉన్న కూడా మరో పక్క ఆహా లో ప్రసారం అవుతున్న ఇండియన్ ఐడల్ గ్రాండ్ ఫినాలే కి ముఖ్య అతిథిగా చిరంజీవి గారు రావడం జరిగింది.ఈ కార్యక్రమంలో వచ్చిన ఆయన పెద్ద ఎత్తున సందడి చేసినట్టు తెలుస్తుంది.
ఈ కార్యక్రమంలో విజేతగా నిలిచినా వాగ్దేవికి ట్రోఫీ అందించడంతో పాటు చిరంజీవి గారు తన చిలిపి చేష్టలతో స్టేజి పైన అందరిని నవ్వించడం జరిగింది.సూపర్ స్టార్ రజని కాంత్ స్టైల్ గురించి అందరికి తెలిసిందే.ఈ కార్యక్రమంలో చిరంజీవి రజని కాంత్ ను ఇమిటేట్ చేయడం జరిగింది.ఈ షో లో రజని కాంత్ గురించి ప్రస్తావన రావడంతో ఆయన గురించి మాట్లాడటమే కాకుండా నడిచి చూపించారు చిరంజీవి.

చిరంజీవి సూపర్ స్టార్ రజని కాంత్ ఎలా నడుస్తారో చూపించడంతో వేదిక మొత్తం కేకలతో ఈలలతో దద్దరిల్లిపోయిందని చెప్పచ్చు.అక్కడున్న ఒక కంటెస్టెంట్ రజని కాంత్ కు పెద్ద అభిమాని కావడంతో చిరంజీవి గారు తన కళ్లజోడును అతనికి బహుమతిగా ఇచ్చారు.రజనీకాంత్ స్టైల్ గా ఎలా కళ్ళజోడు పెట్టుకుంటారో అభిమాని కూడా అలాగే పెట్టుకోవాలి అని చిరంజీవి సూచించారు.ముఖ్యఅతిథిగా ఈ కార్యక్రమంలో వచ్చిన చిరంజీవి రెట్టింపు ఉత్సాహంతో సందడి చేసి అందరిని ఆకట్టుకున్నారు.ప్రస్తుతం ఈ షో కు సంబంధించిన వీడియొ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
View this post on Instagram