చిరంజీవి గారి తల్లికి ఆ హీరో సినిమాలు అంటే చాల ఇష్టమట…ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా…

తమ ఇండ్లలో కోట్లాది మంది ఆరాధ్య దైవం లాగా భావించే చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ కు జన్మనిచ్చారు అంజనా దేవి.ఇక ఈ కుటుంబం నుంచి వీళ్ళ ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అభిమానుల నుంచి ఆదరణ పొందుతున్నారో మనందరికీ తెలిసిన విషయమే.ముఖ్యంగా చెప్పాలంటే అంజనా దేవి గారి మనవడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్నారు.ఇక రెండవ కొడుకు అయినా నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ మరియు కూతురు కొడుకులు అయినా సాయి ధరమ్ తేజ్,వైష్ణవ తేజ్ లు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ అందుకున్నారు.

తన కుటుంబం నుంచి ఇంత మంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.కానీ అంజనా దేవి గారి కి ఇష్టమైన హీరో తన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కాదంట.ఆమెకు ఊహ తెలిసినప్పటి నుంచి అక్కినేని నాగేశ్వరరావు అంటే అంజనా దేవి గారికి చాల ఇష్టమట.ఆయనకు వీరాభిమాని అని కూడా చెప్పచ్చు.ఇక అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమా వస్తే చిన్నప్పటి నుంచి అంజనా దేవి గారు థియేటర్ కు వెళ్లి చూసేవారట.

ఇక మెగాస్టార్ చిరంజీవి గారు చిన్నప్పటి నుంచి సీనియర్ ఎన్టీఆర్ గారికి అభిమాని అన్న సంగతి అందరికి తెలిసిందే.ఇక పవన్ కళ్యాణ్ గారు అమితాబ్ బచ్చన్ కు పెద్ద అభిమాని.ఇక కోట్లాది మంది చేత ఆరాధింపబడుతున్న వీళ్ళు వేరే హీరోలకు పెద్ద అభిమానులు అని తెలిసి మెగా అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.ఇక చిరంజీవి గారు ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమా తో బిజీ గా ఉన్నారు.పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు అనే సినిమాలో నటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *