Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తన ప్రొఫెషనల్ లైఫ్ కి యెంత ఇంపార్టెన్స్ ఇస్తారో అలాగే పర్సనల్ లైఫ్ కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు అనే సంగతి అందరికి తెలిసిందే.ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి స్టార్ డమ్ ను సంపాదించుకున్నారు.బుల్లితెర మీద కూడా అప్పుడప్పుడు కనిపించి సందడి చేసే మెగాస్టార్ చిరంజీవి తాజాగా టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ అడ్డా షో కు స్పెషల్ గెస్ట్ గా రావడం జరిగింది.ఈ షో కు చిరంజీవి తో పాటు బాబీ,వెన్నెల కిషోర్,జబర్దస్త్ శ్రీను కూడా వచ్చి సందడి చేసారు.సంక్రాంతి స్పెషల్ గా వచ్చిన ఈ షో కు సంబంధించిన ప్రోమో వైరల్ అయినా సంగతి తెలిసిందే.
ఈ షో లో చిరంజీవి కామెడీ టైమింగ్స్,మేనేరిజమ్స్,స్టైల్ తో అందరిని ఆకట్టుకున్నారు.యాంకర్ సుమ చిరంజీవి గారితో ఆయన భార్య సురేఖ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు తెలియజేసే ట్రైల్స్ చేసారు.యాంకర్ సుమ చిరంజీవి గారు తన ఫోన్ తన కుటుంబసభ్యులు అయినా సురేఖ,రామ్ చరణ్,పవన్ కళ్యాణ్ పేర్లను యేమని సేవ్ చేసుకున్నారో చెప్పమని కోరింది.
చిరంజీవి గారు ఈ ప్రశ్నకు సురేఖ పేరు ను తన ఫోన్ లో రే అని సేవ్ చేసుకున్నట్లు తెలిపారు.అలాగే చిరంజీవి గారు రామ్ చరణ్ పేరును చెర్రీ అని,పవన్ కళ్యాణ్ పేరును కళ్యాణ్ బాబు అని సేవ్ చేసుకున్నట్లు తెలిపారు.ఇక సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో షేర్ చేసుకున్నారు.