Chiranjeevi: ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి గురించి యెంత చెప్పిన కూడా తక్కువే అవుతుంది.మూడు దశాబ్దాలకు పైగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న చిరంజీవి గారు ఇప్పటికి యంగ్ హీరోలతో పోటీ పడీ మరి నటిస్తున్నారు.తన కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన విజయాలు సొంతం చేసుకొని చెరగని ముద్ర వేసుకున్నారు చిరంజీవి.తన వారసులను,సోదరులను కూడా చిరంజీవి గారు ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి తెలిసిందే.చిరంజీవి గారు అల్లు రామలింగయ్య గారి అల్లుడు.
ఇక అల్లు వారి ఫ్యామిలీ గురించి కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం.అల్లు రామలింగయ్య తన కూతురు సురేఖ ను చిరంజీవి గారికి ఇచ్చి పెళ్లి చేసారు.అల్లు రామలింగయ్య గారి అల్లు అరవింద్ మరియు సురేఖ ఇద్దరు సంతానం.చిరంజీవి తో సురేఖ వివాహం 1980 లో జరిగింది.సినిమా ఇండస్ట్రీలో హీరోగా చిరంజీవి ఎదుగుతున్న సమయంలో చిరంజీవి పడిన కష్టాన్ని ఆయన ప్రవర్తనను చూసి అల్లు రామలింగయ్య చిరంజీవి ని అల్లుడిగా చేసుకున్నారు.కొణిదెల ఫ్యామిలీకి మరియు అల్లు ఫ్యామిలీకి బంధుత్వం ఏర్పడింది.
చిరంజీవి తన వ్యక్తిగత విషయాల గురించి తన పెళ్లి గురించి పలు వేదికల మీద అభిమానులతో పంచుకోవడం జరిగింది.ప్రస్తుతం అప్పట్లో జరిగిన చిరంజీవి సురేఖ పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.వీరిద్దరి వివాహం ఫిబ్రవరి 20 న 1980 లో జరిగింది.ఇంకా మరో రెండు నెలల్లో వీరి పెళ్లి జరిగి 42 ఏళ్ళు పూర్తి అవుతుంది.ఈ క్రమంలో వీరి పెళ్లి పత్రిక సోషల్ మీడియా లో వైరల్ అవుతుండడంతో ఈ పత్రికను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.చిరంజీవి సురేఖ పెళ్లి పత్రిక ఇంగ్లీష్ అక్షరాలతో స్టైల్ ఫాంట్ తో ప్రింట్ అయినా పెళ్లి పత్రిక చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.