ఈ ముగ్గురి కాంబినేషన్ లో భారీ మల్టీ స్టారర్ సినిమా ఆగిపోవడానికి వెనుక అసలు కారణం ఏమిటో తెలుసా…


ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మల్టీ స్టారర్ సినిమాలు వస్తున్నాయి.ప్రేక్షకులు కూడా మల్టీ స్టారర్ సినిమాలు చూడడానికి బాగా ఆసక్తి చూపిస్తున్నారు.ఇటీవలే రిలీజ్ అయినా మల్టీ స్టారర్ సినిమా ట్రిపుల్ ఆర్ ఎంతటి ఘానా విజయం సాధించిందో అందరికి తెలిసిందే.నందమూరి మరియు మెగా హీరోలను ఒకే స్క్రీన్ పై నటింప చేయడంలో జక్కన్న సక్సెస్ సాధించారు.చాల సంవత్సరాల గ్యాప్ తర్వాత ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో నటించడం ఇదే మొదలు.ఇంకా చిన్న పెద్ద హీరోలు కలిసి కూడా మల్టీ స్టారర్ సినిమాలు చేస్తున్నారు.ట్రిపుల్ ఆర్ చిత్రంలో ఇద్దరు హీరోలకు సమంగా ప్రాధాన్యత ఉన్న ఎన్టీఆర్ అభిమానులు మాత్రం తమ హీరోను కాస్త తక్కువ చేసి చూపించారని ఆరోపణలు చేసిన సంగతి అందరికి తెలిసిందే.

ఇది ఇలా ఉంటె ఈ చిత్రం మాత్రం దేశ వ్యాప్తంగా ఘన విజయం సాధించింది.ఇక ఆ తర్వాత రిలీజ్ అయినా ఆచార్య చిత్రంలో మెగా స్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ కలిసి నటించారు.అయితే ఈ చిత్రం మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.ఇక నాగార్జున మరియు నాగ చైతన్య కలిసి నటించిన బంగార్రాజు చిత్రం మంచి విజయం అందుకుంది.అయితే చిరంజీవి,నాగార్జున,వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన భారీ మల్టీ స్టారర్ చిత్రం సెట్స్ పైకి వెళ్లక ముందే ఆగిపోయింది అన్న సంగతి చాల మందికి తెలీదు.ఇంద్ర సినిమా తర్వాత 2002 వ సంవత్సరంలో రాఘవేంద్ర రావు ముగ్గురు స్టార్ హీరోలతో కలిసి భారీ మల్టీ స్టారర్ సినిమాను చేయాలనీ అనుకున్నారు.

nagarjuna venkatesh chiranjeevi
Nagarjuna Venkatesh Chiranjeevi

ఆ సినిమాను తన 100 వ సినిమాగా చరిత్రలో నిలిచిపోయేలా అందరికి గుర్తుండి పోయేలా తెరకెక్కించాలి అని అనుకున్నారు.అప్పట్లో ఈ చిత్రానికి చిన్ని కృష్ణ కథను కూడా రెడీ చేసారు.ఈ చిత్రానికి త్రివేణి సంగమం అనే టైటిల్ కూడా అనుకున్నారు.మూడు హిందూ పుణ్య క్షేత్రాల నేపథ్యంలో కథను రెడీ చేసారు.ఈ భారీ మల్టీ స్టారర్ సినిమాను రామానాయుడు,అల్లు అరవింద్,అశ్వని దత్ కలిసి నిర్మించాలని అనుకున్నారు.చివరకు క్లైమాక్స్,హీరోల ఇంట్రడక్షన్ సీన్స్ కుదరకపోవడం వలెనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లక ముందే ఆగిపోయింది.అప్పట్లో ఈ చిత్రం తెరకెక్కి ఉంటె అతి పెద్ద మల్టీ స్టారర్ చిత్రం అయి ఉండేది.అయితే ఈ ముగ్గురు స్టార్ హీరోల అభిమానులకు మాత్రం చివరకు నిరాశే మిగిలింది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *