Chirunavvutho: సినిమా ఇండస్ట్రీలో ఒక్క సినిమాతో ఎంతో ఫేమస్ అయ్యి ఆ తర్వాత మరో సినిమాతో ఇండస్ట్రీకి దూరం అవుతుంటారు చాల మంది.ఒకటి రెండు సినిమాలే చేసినప్పటికీ కొంత మంది తమ పాత్రలతో ప్రేక్షకులకు ఎప్పటికి గుర్తుండిపోతారు.ఆ తర్వాత సినిమా అవకాశాలు రాకపోవడంతో పెళ్లిళ్లు చేసుకొని సినిమా ఇండస్ట్రీకి దూరం అయిపోతుంటారు.ఇలాంటి వాళ్ళల్లో వేణు హీరో గా నటించిన చిరునవ్వుతో( Chirunavvutho ) హీరోయిన్ కూడా ఒకరు అని చెప్పచ్చు.22 ఏళ్ళ క్రితం రిలీజ్ అయినా ఈ సినిమాను ఇప్పటికి కూడా ప్రేక్షకులు ఎంతో ఆనందంగా చూస్తారు.
అప్పట్లో ఈ సినిమాకు మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు,కథను అందించటం విశేషం అని చెప్పచ్చు.ఈ సినిమాలోని ప్రతి డైలాగ్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.ఈ సినిమాతోనే మొదటి సారి ప్రముఖ నటుడు,కమెడియన్ సునీల్ పరిచయం అయ్యారు కానీ నువ్వే కావాలి సినిమా మొదట రిలీజ్ అయ్యింది.స్వయంవరం సినిమాతో మొదటి సారి హీరోగా ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నారు తొట్టెంపూడి వేణు.

ఆ తర్వాత వేణు మనసు పడ్డాను సినిమా వచ్చిన కూడా అది పరాజయం పొందింది.ఇక అదే సమయంలో తోలి సినిమా నిర్మాత శ్యామ్ ప్రసాద్ జి రామ్ ప్రసాద్ ను డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది.షాహిన్ ఖాన్,ప్రేమ ఈ సినిమాలో హీరోయిన్ లుగా నటించారు.చిన్న సినిమా అయినప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ సినిమా.నాలుగు నంది అవార్డులను అందుకొని,కన్నడ,తమిళ్,హిందీ భాషలలోకి రీమేక్ చేయబడింది.
ఇక హిందీ మినహాయించి మిగిలిన అన్ని భాషలలో షహీన్ ఖాన్( Shaheen Khan ) సంధ్య పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకుంది.మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె సింగర్ శంకర్ మహదేవన్ మ్యూజిక్ వీడియోస్ చేసింది.ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ లో కూడా అలరించింది.తెలుగులో డార్లింగ్ డార్లింగ్ అనే సినిమాలో చివరిసారిగా కనిపించిన ఈమె ఆ తర్వాత పెళ్లి చేసుకొని సెటిల్ అయిపొయింది.ఈమెకు ఒక కూతురు ఉన్న కూడా ఇప్పటికి అదే ఫిట్ నెస్ ను అందాన్ని మైంటైన్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది షహీన్ ఖాన్.
View this post on Instagram